ఏజెంట్ విడుదలకు ఇంకో 50 రోజుల కంటే తక్కువ టైమే ఉంది. అక్కినేని అభిమానులు కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పనులు అయిపోయానుకుంటే పప్పులో కాలేసినట్టేనని ఇన్ సైడ్ టాక్. మొన్నటిదాకా మస్కట్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి టీమ్ ఇంకో రెండు పాటలను బ్యాలన్స్ పెట్టిందట. ఏప్రిల్ రెండో వారంలోపు వాటిని పూర్తి చేస్తే 28న విడుదలకు రూట్ క్లియర్ అవుతుంది. హైదరాబాద్ లో ఇంకొంత ప్యాచ్ వర్క్ ని ఫినిష్ చేస్తే లోకల్ పార్ట్ వరకు గుమ్మడికాయ కొట్టేయొచ్చు. కీలకమైన క్లైమాక్స్ ఆల్రెడీ అయిపోవడం రిలీఫ్.
ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీని పక్కా ప్లానింగ్ తో చేస్తూ వచ్చినప్పటికీ చివరి నిమిషం దాకా ఎందుకు పనులు తప్పడం లేదనేది అర్థం కాని ప్రశ్న. ఇంకా నయం డిసెంబర్ లో 2023 సంక్రాంతి విడుదలని ఓ పోస్టర్ వదిలిన నిర్మాత అనిల్ సుంకర తర్వాత సైలెంట్ అవ్వడం తెలిసిందే. ఏజెంట్ కి బజ్ పెంచడం చాలా కీలకం. అఖిల్ ఇప్పటిదాకా చేసిన రొమాంటిక్ కథలకు భిన్నంగా పూర్తి స్టైలిష్ మాస్ లోకి వెళ్ళిపోయాడు. ఇది కనీసం బ్లాక్ బస్టర్ అయితే తప్ప తమ హీరోల వరస ఫ్లాపులతో అసంతృప్తిలో ఉన్న ఫ్యాన్స్ నిరసన చల్లారదు. అందుకే ఇంతగా చెక్కుతున్నారు.
పైగా ఏజెంట్ కు గట్టి పోటీ ఉంది. పొన్నియన్ సెల్వన్ 2ని ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 28నే రిలీజ్ చేయడం ఖాయమని మణిరత్నం నొక్కిమరీ చెబుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ టీమ్ ఇంటర్వ్యూలు గట్రా ఇస్తూ పబ్లిసిటీ మొదలుపెట్టింది. ఏజెంట్ కి సంబంధించి పాటల సంగతి పక్కపెడితే ట్రైలర్ మీద ఓ రేంజ్ లో హైప్ ఉంది. అది బాగా కట్ చేస్తేనే పీఎస్ 2తో తమిళనాడు, కేరళ, నార్త్ స్టేట్స్ లో బిజినెస్ పోటీని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. సైరా తర్వాత సూరికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత అఖిల్ కి ఈ ఏజెంట్ ఆషామాషీ హిట్ అయితే సరిపోదు. రికార్డులు బద్దలవ్వాలి.
This post was last modified on March 10, 2023 10:54 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…