రెండు రోజుల క్రితం కెజిఎఫ్ మీద విపరీతమైన కామెంట్లు చేసి సోషల్ మీడియాలో వైరల్ టాపిక్ గా మారిపోయిన దర్శకుడు కం నటుడు వెంకటేష్ మహా తాజాగా యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ లో కనిపించాడు. డిస్నీ హాట్ స్టార్ లో నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ నాలుగు భాగాల యాంథాలజీలో వెంకటేష్ ఓ స్టార్ హీరో అభిమానిగా నటించాడు. డెబ్భై రూపాయల టికెట్ ని పన్నెండు వందలకు అమ్మితే తీరా బెనిఫిట్ షో సమయానికి డిజిటల్ ప్రింట్ కీ రాకపోవడం, ఆ తర్వాత లోకల్ కుర్ర లీడర్ చేతిలో అవమానింపపబడటం అనే పాయింట్ మీద చివరి ఎపిసోడ్ ని తీశారు.
మనిషికి కోపం వచ్చే పరిస్థితులను థీమ్ గా తీసుకుని ఈ యాంగర్ టేల్స్ ని రూపొందించారు. ముందే బెనిఫిట్ షో ఎపిసోడ్లో బూతులు ఉంటాయని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హింట్ ఇచ్చారు కానీ ఫైనల్ గా ఫ్యామిలీతో పాటు కూర్చుంటే వామ్మో అనిపించే రేంజ్ లో సంస్కృతం వాడేశారు. ఎంత సహజత్వం కోసమే అయినా మరీ ఇంతగా డబుల్ మీనింగ్ పదాలు వాడాల్సిన అవసరమైతే లేదనిపిస్తుంది. నటుడిగా వెంకటేష్ మహా, అతన్ని కవ్వించే పాత్రలో సుహాస్ బాగానే నటించారు. ఉన్నవాటిలో ఇదొక్కటే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది కానీ మిగిలినవి నెరేషన్ సమస్య వల్ల అంతగా ఆకట్టుకోవు.
మొన్న సినిమాటిక్ లిబర్టీ గురించి హీరో క్యారెక్టరైజేషన్ గురించి అంత వెటకారంగా మాట్లాడిన వెంకటేష్ మహా దీనికి తను దర్శకుడు కాకపోయినా ఇప్పుడీ బూతు మాటల పురాణాన్ని ఎలా సమర్ధించుకుంటాడో. ఇది న్యాచులారిటీ, ముందే చెప్పాము కదా అంటారేమో. అలాంటప్పుడు ఎవరి క్రియేటివిటీ అయినా అంతే కదా. కుటుంబమంతా కలిసి కూర్చుని చూడండి అని ధైర్యంగా చెప్పలేని స్థాయిలో మన కంటెంట్ ఉన్నప్పుడు ఇంకొకరిని వేరే విషయంలో ఎలా అంటారని నెటిజెన్లు నిలదీస్తున్నారు. కేరాఫ్ కంచరపాలం డైరెక్టర్ గా కన్నా వివాదాలు, నటనతోనే వెంకటేష్ మహా ఎక్కువ పాపులర్ అవుతున్నాడు.
This post was last modified on March 10, 2023 10:32 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…