సోషల్ మీడియా పెరిగిపోయాక ఎవరు ఏమైనా అనొచ్చు ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు. ముఖ్యంగా సినిమా రాజకీయాలు తప్ప ముఖ్యంగా ట్విట్టర్ లో ఇంక దేనిపైనా అంతగా చర్చలు వైరల్ కావడాలు ఉండవు. మహా అయితే అప్పుడప్పుడు క్రికెట్ రూపంలో స్పోర్ట్స్ ఉంటాయి అంతే. నిన్న నాని దసరా సినిమా నుంచి చమ్కీలా అంగేసి లిరికల్ వీడియో రిలీజైన సంగతి తెలిసిందే. మంచి క్యాచీ ట్యూన్ తో సంతోష్ నారాయణన్ చేసిన కంపోజింగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. దానికి తోడు మిర్యాల రామ్, దీలు పాడిన విధానం మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది.
కాసర్ల శ్యాం రాసిన సాహిత్యం పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో సాగింది. చమ్కీల అంగీలేసి ఓ వదినా చాకులెక్క ఉండేటోడే, కండ్లకు అయినా పెట్టి ఓ వదినా, చినిగిన బనీనేసి నట్టింట్లో కూసుంటడే ఇలా అచ్చ నైజామ్ భాషలో పదాలు అలవోకగా కదిలాయి. కథా నేపధ్యానికి తగ్గట్టు రాసి స్వరపరిచిన పాట ఇది. అయితే ఇందులో మరీ ఎక్కువ ప్రాంతీయతత్వం జొప్పించి అర్థం కానట్టు రాయించారని ఇది అన్ని వర్గాలను చేరేలా లేదని కొందరు అదే పనిగా ట్వీట్లు వేయడం మొదలుపెట్టడంతో దానికి కౌంటర్లుగా భాషాభిమానులు బలమైన సమాధానం ఇవ్వడం మొదలుపెట్టారు.
ఇటీవలే వచ్చిన బలగంలోనూ తెలంగాణ మట్టివాసన, పాటల గుబాళింపు పుష్కలంగా ఉంది. ఫిదా, లవ్ స్టోరీలో శేఖర్ కమ్ముల కోరిమరీ ఇలాంటి పాటలు చేయించుకున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డిలో బ్యాక్ డ్రాప్ ఈ భాషమీదే ఉంటుంది. అలాంటప్పుడు ప్రత్యేకంగా దసరాలోనే ఆ నేటివిటీని అతిగా జొప్పించారని లాజిక్ లేకుండా కామెంట్ చేయడం అర్ధరహితం. మార్చి 30న విడుదల కాబోతున్న ఈ రా విలేజ్ డ్రామాలో నాని ఊర మాస్ గెటప్ లో ప్రాణం పెట్టాడు. తను ప్యాన్ ఇండియా లెవెల్ లో రాష్ట్రాలన్నీ తిరుగుతుంటే ఇక్కడ ట్విట్టర్ లోనేమో తెలుగువాళ్లే పాటల శల్యపరీక్ష చేయడం విచారకరం.
This post was last modified on March 10, 2023 10:13 am
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…