నందమూరి బాలకృష్ణతో అనిల్ రావిపూడి తీస్తున్న nbk108 హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తారకరత్న మరణం కారణంగా కాస్త వాయిదా పడిన షూటింగ్ తాజాగా మొదలైంది. శ్రీలీల కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. బాలయ్య హ్యాండ్ పట్టుకొని శ్రీ లీల ఫోటో ఒకటి వదిలి ఆమె సెట్స్ లో ఉన్న విషయాన్ని షేర్ చేశారు మేకర్స్. ఇందులో శ్రీలీల చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఆమె పాత్ర నిడివి తక్కువే ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
ఇందులో శ్రీలీలకి హీరో ఎవరూ ఉండకపోవచ్చని అంటున్నారు. శ్రీలీల బాలయ్యకి కూతురిగా కనిపించనుందని గట్టి ప్రచారం జరుగుతుంది. మేకర్స్ మాత్రం ఆ విషయాన్ని ఎక్కడా ప్రకటించలేదు. ఇంపార్టెంట్ రోల్ అంటూ చెప్తున్నారు తప్ప ఆమె పాత్ర గురించి ఎలాంటి లీడ్స్ ఇవ్వడం లేదు. తాజా సమాచారం మేరకు శ్రీలీల ఈ సినిమా కోసం ఇరవై నుండి ముప్పై రోజులే డేట్స్ ఇచ్చిందని తెలుస్తుంది. ముందుగా బాలయ్య శ్రీలీల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత ఆమె మహేష్ సినిమాకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంది.
ఇక బాలయ్య సినిమాలో మొత్తంగా శ్రీ లీల పాత్ర ఓ గంట లోపే ఉండొచ్చని అంటున్నారు. తక్కువ డేట్స్ కాబట్టే బిజీ షెడ్యూల్ లో కూడా ఆమె ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసిందని చెప్తున్నారు. షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి , హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా కనిపించనుందని ప్రచారంలో ఉంది. త్వరలోనే మేకర్స్ ఆ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
This post was last modified on March 9, 2023 8:04 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…