Movie News

నితిన్ సైలెంట్ అయిపోయాడేంటి ?

రైటర్ కం డైరెక్టర్ వక్కంతం వంశీతో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య మారేడుమిల్లి ఫారెస్ట్ లో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకొచ్చారు. షూటింగ్ అప్ డేట్స్ తో నితిన్ ప్రీ లుక్ స్టిల్ తో సినిమాపై ఆ టైమ్ లో ఫుల్ అటెన్షన్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎందుకో ఉన్నపళంగా సైలెంట్ అయిపోయారు. నితిన్ ఈ సినిమా షూటింగ్ గురించి కానీ, అప్ డేట్స్ కానీ ఇవ్వకుండా సైలెన్స్ మెయిన్టైన్ చేస్తున్నాడు.

మొన్నీ మధ్యే నితిన్ హనుమాన్ మాల ధరించాడు. దానికోసమే కొంత బ్రేక్ తీసుకొని ఉండొచ్చా ? లేదా రష్ చూసుకున్నాక వక్కంతం అండ్ టీం నెక్స్ట్ షెడ్యూల్ కి గ్యాప్ తీసుకొని మళ్ళీ రీ షూట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ? తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ తో వక్కంతం దర్శకుడిగా మారాడు. ఆ సినిమా ఫ్లాఫ్ అవ్వడంతో వక్కంతంకి రెండో సినిమా పట్టుకోవడానికి చాలా టైమ్ పట్టింది. ఫైనల్ గా నితిన్ కి ఎర్ర చందనం నేపథ్యంతో ఓ యాక్షన్ కథ చెప్పి వర్కవుట్ చేసుకున్నాడు. ఇందులో లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు నితిన్.

‘భీష్మ’ తర్వాత నితిన్ కి సక్సెస్ లేదు. తాజాగా వచ్చిన ‘మాచర్ల నియోజక వర్గం’ కూడా బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో నితిన్ కి కూడా వక్కంతం ఎట్టి పరిస్థితుల్లో హిట్ ఇవ్వాల్సి ఉంది. దర్శకుడిగా తను ప్రూవ్ చేసుకోవడంతో పాటు , నితిన్ కి హిట్ ఇచ్చే భాద్యత వక్కంతం మీద ఉన్నాయి. అందుకే షూటింగ్ కి బ్రేక్ తీసుకుంటూ మళ్ళీ రీ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. మరి నితిన్ ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ఇచ్చే వరకు ఈ సినిమాపై రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి.

This post was last modified on March 10, 2023 8:09 am

Share

Recent Posts

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

30 minutes ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

33 minutes ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

1 hour ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

2 hours ago

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…

3 hours ago

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

3 hours ago