రెండు మూడు నెలల గ్యాపులో వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా మరో సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం కిరణ్ ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమా థియేటర్స్ లో ఆడుతుంది. వచ్చే నెల ‘మీటర్’ అనే సినిమాతో మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతున్నాడు. ఆ వెంటనే ‘రూల్స్ రంజన్’ సినిమా లైన్లో ఉంది. ఆ సినిమా షూటింగ్ ఫినిషింగ్ లో ఉంది. తాజాగా మరో సినిమాను లాంచ్ చేసుకున్నాడు యంగ్ హీరో.
కిరణ్ అబ్బవరం 9 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు విశ్వకరున్ దర్శకుడు. డెబ్యూ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్న కిరణ్ ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు. ఇక రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కూడా సినిమా కౌంట్ లో 15 దగ్గరే ఉంటే నిన్న మొన్న వచ్చిన కిరణ్ మాత్రం అప్పుడే 9 సినిమాల కౌంట్ కి చేరుకొని పదో సినిమా దగ్గరికి వచ్చేశాడు.
ఇలా నెలల గ్యాప్ లో కిరణ్ సినిమాలు రిలీజ్ చేస్తుండటంతో నెటిజన్లు గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు. వరుస సినిమాలతో ఆది సాయి కుమార్ తర్వాత నువ్వే అంటూ కిరణ్ పై కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం అవేమీ పట్టించుకోకుండా వరుస సినిమాలతో కౌంట్ పెంచేసుకుంటూ వెళ్తున్నాడు కానీ క్వాలిటీ చూసుకోవడం లేదనేది ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు కంటెంట్ తో ఈ కుర్ర సూపర్ హిట్ కొట్టింది లేదు. కమర్షియల్ గా ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ , ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలు ఫరవాలేదనిపించాయి కానీ కంటెంట్ పరంగా పూర్తి స్తాయిలో మెప్పించలేదు. మరి కుర్ర హీరో ఇకపై అయినా కౌంట్ తగ్గించి కంటెంట్ మీద దృష్టి పెడితే బాగుంటుందేమో.
This post was last modified on March 9, 2023 2:57 pm
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినంతనే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. కేవలం 10 నెలల కాలంలోనే ఏపీకి ఏకంగా రూ.7 లక్షల…