Movie News

సినిమాలు చిన్నవి నిర్మాతల కష్టాలు పెద్దవి

కరోనా తర్వాత మారిన పరిస్థితులకనుగుణంగా ఓ నిర్మాత చిన్న సినిమా తీశాడు. బడ్జెట్ రెండు మూడు కోట్లలోనే అయిపోయింది. థియేటర్లలో వర్కౌట్ కాదని ముందే తెలుసు. లాక్ డౌన్ టైంలో ఓటిటిలు పోటీ పడి చిన్నా పెద్ద తేడా లేకుండా అన్నింటిని కొనడం చూసి టెంప్ట్ అయ్యాడు. దర్శకుడు, తారాగణం, టెక్నికల్ టీమ్ దాదాపు అందరూ కొత్త వారే. కథ బాగుంది. ప్రెజెంటేషన్ చక్కగా వచ్చింది. ప్రివ్యూలు వేస్తే అందరూ శభాష్ అన్నారు. ఇంకేముంది డబ్బు పేరు రెండూ వస్తాయని ఆశ పడిన ఆ ప్రొడ్యూసర్ కి అసలు బొమ్మ తర్వాత కనిపించడం మొదలైంది. మిత్రుల రికమండేషన్ తో డిజిటల్ కంపెనీల తలుపు తట్టడం షురూ చేసాడు

ఒక్కో ఓటిటికి బృందానికి వరస బెట్టి షోలు వేశాడు. కొందరు ముందు థియేటర్ రిలీజ్ చేయండి, పబ్లిక్ టాక్ రివ్యూలను బట్టి రేట్ డిసైడ్ చేస్తామని చెప్పారు. మరొకళ్ళు మా రూల్స్ మారాయి ముందు హాళ్లలో వదలండి అప్పుడు మాట్లాడుకుందామని మెలిక పెట్టారు. ఇంకొకరు కోటిన్నర ఇస్తాం ఇష్టముంటే ఇవ్వండి లేదంటే గుడ్ బై అనేశారు. ఇంకో ప్రతినిథి మేము నేరుగా కొనకూడదు థర్డ్ పార్టీ ఫలానా సంస్థ ఉంది వాళ్లకు అమ్మేసేయండి అప్పుడు పని సులభంగా అవుతుందని ఫోన్ నెంబర్ ఇస్తాడు. తీరా కాల్ చేస్తే వెయిటింగ్ లిస్టులో ఉన్న ఇరవై సినిమాల పేర్లు చెప్పాడతను. ఇంకొంత కాలం ఆగమని చెప్పి కబుర్లు చెప్పేసి పెట్టేశాడు

సరే ఏదైతే అదయ్యిందని సదరు నిర్మాత థియేటర్ రిలీజ్ కు సిద్ధపడ్డాడు. ప్రింటు, ప్రమోషన్, క్యూబ్, రెంట్లు, ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, పిఆర్ వ్యవహారాలు వగైరా మొత్తం కలిసి మరో యాభై లక్షల నుంచి కోటి దాకా జేబుకి చిల్లు పడింది. ఇంతా చేసి సినిమా ఆడలేదు. ముందే షోలు చూసేసిన ఓటిటి రెప్పులు మొహం చాటేశారు. రేట్ తగ్గించి షాక్ ఇచ్చారు. సరే ఏదోలా వదిలించుకుందామని థర్డ్ పార్టీ కాళ్ళు గెడ్డాలు పట్టుకుని అమ్మేసినా భారీ నష్టం వచ్చింది. కట్ చేస్తే ఓటిటిలో వచ్చాక మిలియన్ల వ్యూస్ వచ్చి మధ్యలో ఉన్నవాడు స్ట్రీమింగ్ చేసినవాడు ఇద్దరూ లాభపడ్డారు. అసలు నిర్మాత వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది..

ఈ పరిస్థితిని ఇండస్ట్రీలో ఎందరో ఎదురుకుంటున్నారు. ఇండస్ట్రీ మీద ఫ్యాషన్ తో ఏదో గుర్తింపు తెచ్చుకోవాలన్న తాపత్రయంతో ఆస్తులు తాకట్టు పెట్టి కోట్లు ధారపోస్తే లాభం కనీసం లక్షల్లో రావడం లేదు. ఇక్కడ తప్పెవరిది అనడం కన్నా వాస్తవాలను బేరీజు వేసుకోకుండా నేరుగా నిర్మాణంలో దిగిపోతున్న వాళ్లకు వస్తున్న సమస్య. వెనక్కు వెళ్లలేక మధ్యలో ఆపలేక తీరా విడుదల చేశాక శాటిలైట్ డబ్బింగ్ డిజిటల్ అమ్ముడుపోక నరకం చూస్తున్నారు. నాలుగు డబ్బులు వెనకేసుకురావడం తర్వాత పెట్టుబడి వస్తే చాలు దేవుడా అనే దాకా వెళ్ళిపోయింది. దూరపు కొండలు నునుపని పెద్దలు ఊరికే అనలేదు. ఆ సామెతకు అర్థం ఇంతకన్నా ఏముంటుంది

This post was last modified on March 10, 2023 8:11 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

18 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago