రాను రాను రీరిలీజుల వ్యవహారం మరీ దారుణంగా తయారవుతోంది. పాత బ్లాక్ బస్టర్లని రీ మాస్టర్ చేయించి విడుదల చేస్తేనే థియేటర్ల దగ్గర జనం కనిపించడం లేదు. అలాంటిది డిజాస్టర్లను తీసుకురావడమంటే అదో పెద్ద విచిత్రం. ఆ మధ్య ప్రభాస్ రెబెల్ ని హీరో పుట్టినరోజనే సెంటిమెంట్ తో ఫ్యాన్స్ మీద రుద్దితే ఆ ఎమోషనల్ ట్రాప్ లో పడ్డ అభిమానులు చాలా చోట్ల దాన్ని బాగానే ఆదరించి వసూళ్లు ఇచ్చారు. అలా అని అదేమీ ఇప్పటికిప్పుడు కల్ట్ క్లాసిక్ అయిపోలేదు. డార్లింగ్ కెరీర్ మొత్తంలో అత్యంత బ్యాడ్ మూవీస్ లో దాని చోటు పదిలంగానే ఉంది.
ఇప్పుడీ వరసలో జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా తీసుకొస్తున్నారు. అది కూడా ఈ మార్చి నెలలోనే. దీని మీద తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, టెంపర్ లాంటి మంచి సినిమాలు వదిలేసి ఇలాంటి ఫ్లాపులను ఎందుకు రుద్దుతున్నారని నిలదీస్తున్నారు. తీరా రేపు కలెక్షన్లు రాకపోతే ట్విట్టర్ లో జరిగే ట్రోలింగ్ కి అనవసరమైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2004లో వచ్చిన ఆంధ్రావాలా అప్పట్లో ఒక సంచలనం. ఆడియో లాంచ్ కి లక్షలాది అభిమానులను స్పెషల్ ట్రైన్లు వేసి మరీ తీసుకెళ్లడం ఒక చరిత్ర.
మళ్ళీ అది ఎవరికీ రిపీట్ కాలేదు. విపరీతమైన హైప్ తో వచ్చిన ఆంధ్రావాలా అంచనాలను కనీస స్థాయిలో అందుకోలేకపోయింది. దర్శకుడు పూరి జగన్నాధ్ తో పాటు ప్రేక్షకులకూ పెద్ద షాక్ ఇచ్చింది. రొటీన్ స్టోరీ, అతిగా అనిపించే కామెడీ ట్రాక్, అతకని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వెరసి ఏ కోణంలోనూ కనీసం పర్వాలేదనే టాక్ తెచ్చుకోలేదు. ఒక్క చక్రి పాటలు వాటికి జూనియర్ డాన్సులు మాత్రమే అంతో ఇంతో సేవ్ చేశాయి తప్ప మిగిలినదంతా స్క్రాపని ఎవరైనా ఒప్పుకుంటారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సంబరం జరుగుతున్న టైంలో అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో