నిన్న చెప్పుకోదగ్గ అంచనాలతో రన్బీర్ కపూర్ కొత్త సినిమా తూ ఝూటి మై మక్కర్ రిలీజయ్యింది. హోలీ పండగతో పాటు లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుని భారీ ఎత్తున థియేటర్లకు తీసుకొచ్చారు. పఠాన్ యాభై రోజులకు దగ్గరగా ఉండటం, షెహజాదా – సెల్ఫీలు దారుణంగా డిజాస్టర్ కావడంతో అంచనాలన్నీ దీని మీదే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత భీభత్సంగా లేకపోయినా ట్రెండింగ్ లో ఉందంటూ, భారీ ఓపెనింగ్స్ ఖాయమంటూ మీడియా ఊదరగొట్టింది. దానికి తగ్గట్టే నిన్న పలువురు క్రిటిక్స్ ఏకంగా నాలుగు ఆపై రేటింగ్ ఇవ్వడంతో నిజంగా అంత గొప్పగా ఉందానే డౌట్ వచ్చింది..
వాస్తవానికి ఈ తూ ఝూటి మై మక్కర్ ఒక రెగ్యులర్ లవ్ డ్రామా. ప్రేమ జంట, వాళ్ళ మధ్య ఈగో, ఘాటు రొమాన్సు, విడిపోవడం తర్వాత మళ్ళీ ఇంకో చోట కలుసుకోవడం ఇలా ఆల్రెడీ చూసేసిన టెంప్లేట్ లోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ సహనానికి విపరీతమైన పరీక్ష పెడుతుంది. చివరి నలభై నిమిషాలు మాత్రమే ఓ మోస్తరుగా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది తప్ప ఇదేదో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే రేంజ్ లో మోస్తున్నంతగా మాత్రం ఖచ్చితంగా లేదు. రన్బీర్ కపూర్ నటన, శ్రద్ధ కపూర్ ఎక్స్ పోజింగ్ యూత్ ని ఆకట్టుకునేలా వచ్చాయి కానీ మిగిలినవి సోసోనే
దర్శకుడు లవ్ రంజన్ తన గత చిత్రం సోను కె టిటూ కె స్వీటీ స్థాయిలో ఇది లేకపోయినా ముందే ప్రిపేరయ్యి వెళ్తే తప్ప కనీస స్థాయిలో ఆస్వాదించేలా లేదు. పాటలు కూడా అంతంత మాత్రమే. కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్లకు ఇంత విచ్చలవిడిగా శ్రద్ధ కపూర్ అందాల ప్రదర్శన చేసింది ఇందులోనే. హిందీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి లేకపోయినా ఈ ఝూటి మక్కర్ లు పెద్దగా మేజిక్ చేయకపోవచ్చు. అయితే దగ్గరలో భారీ రిలీజ్ ఏదీ లేదు కాబట్టి ఆ ఒక్క అంశం కలిసి వచ్చేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి
This post was last modified on March 9, 2023 11:03 am
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన కూటమి సర్కారు సింగిల్ పైసా పెట్టుబడులు కూడా రాబట్టలేదని విపక్షం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేత కిరణ్ రాయల్ తో పాటు పలువురు నేతలు,…
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను…
భారత క్రికెట్ అభిమానుల ఆశలపై మరోసారి మబ్బులు కమ్ముకున్నాయి. త్వరలో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి…
ప్రజా గాయకుడు గద్దర్ కు పద్మ అవార్డుల వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్… బీజేపీ,…
వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రకటించి కలకలం రేపారు కదా. ప్రకటించినట్లుగానే ఆయన తన…