ఒక సినిమాకు కథ రాసేటపుడే హీరో ఎవరనే విషయం దాదాపు ఖరారైపోతుంది కానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం ముందే ఫిక్సవడం అంటూ ఏమీ ఉండదు. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే ముందే హీరోయిన్ని ఫిక్స్ చేసుకుంటారు. స్క్రిప్టు ఓకే అయ్యాక ఆడిషన్స్ చేయడం, అందుబాటును బట్టి హీరోయిన్ని ఎంచుకోవడం జరుగుతుంటుంది.
ఈ క్రమంలో కొందరిని ఆడిషన్స్ చేసి పాత్రకు సూటయ్యే ఒక్కరిని ఎంచుకుంటూ ఉంటారు. ఐతే ఆ ఛాన్స్ మిస్సయిన వాళ్లు.. ఆ సినిమా పెద్ద హిట్టయి తమను ఆడిషన్ చేసిన క్యారెక్టర్‌కు మంచి పేరొస్తే ఫీలవకుండా ఉండలేరు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి ఖన్నా సైతం ఇలాగే ఓ పాత్ర విషయంలో బాధ పడుతోంది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలిచిన బాహుబలిలో ఆమె నటించాల్సిందట.
ఈ చిత్రంలో తమన్నా చేసిన అవంతిక పాత్ర కోసం ముందు రాశినే సంప్రదించారట. కానీ ఆ పాత్రకు చేసిన ఆడిషన్లో తాను రాజమౌళిని మెప్పించలేకపోయినట్లు రాశి ఖన్నా వెల్లడించింది.
తనను యోధురాలి పాత్రలో చూసి జక్కన్న తట్టుకోలేకపోయినట్లు రాశి చెప్పడం విశేషం. బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి నేను కూడా వెళ్లా. అందులో అవంతిక పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చా. ఐతే సుకుమారమైన ముఖంతో ఉన్న నేను కత్తి పట్టుకుని కనిపించేసరికి రాజమౌళి గారు తట్టుకోలేకపోయారు. ఈ పాత్రకు కొంచెం రఫ్ లుక్ కూడా కావాలని, నేను సూట్ కానని చెప్పారు. తన స్నేహితుడు ఒక లవ్ స్టోరీ తీస్తున్నారని చెప్పి నన్ను అక్కడికి వెళ్లమన్నారు. రాజమౌళి ఫ్రెండ్ అయిన సాయి కొర్రపాటి గారి దగ్గరికి వెళ్లి కథ విన్నా. అదే.. ఊహలు గుసగుసలాడే. ఆ సినిమాతో దక్షిణాది చిత్రాలపై నాకున్న అభిప్రాయమే మారిపోయింది అని రాశి చెప్పింది.
This post was last modified on March 9, 2023 10:45 am
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…