నెలన్నర కిందట ‘పఠాన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం రేపిందో తెలిసిందే. బాలీవుడ్ చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి బాక్సాఫీస్ సునామీని చూసింది. బాలీవుడ్ చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతూ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి చాలా ఏళ్లయింది.
చివరగా ‘దంగల్’ సినిమా రిలీజ్ టైంలో ఆ పరిస్థితి చూశాం. తర్వాత ఏ చిత్రం కూడా దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. సౌత్ సినిమాలదే బాక్సాఫీస్ దగగ్గర ఆధిపత్యం అయింది. ఐతే ‘పఠాన్’ సినిమాతో షారుఖ్ మళ్లీ బాలీవుడ్‌కు కళ తెచ్చాడు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. కొవిడ్ దెబ్బకు కుదేలైన బాలీవుడ్‌కు ఇది మామూలు సంతోషాన్నివ్వలేదు. దీంతో చెడ్డ రోజులన్నీ పోయాయని.. ఒకప్పటి పరిస్థితులు వచ్చేశాయని బాలీవుడ్ జనాలు చాలా ఎగ్జైట్ అయ్యారు.
కానీ వారి ఆనందం ఆ సినిమా వరకే పరిమితం అయింది. బాలీవుడ్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది. ‘పఠాన్’ తర్వాత ఏ హిందీ చిత్రం కూడా కనీస ప్రభావం చూపించలేదు. ఇలా రావడం.. అలా వెళ్లిపోవడం.. ఇదే జరుగుతోంది. కొన్ని రోజుల కిందటే అక్షయ్ కుమార్ సినిమా ‘సెల్ఫీ’కి దారుణ పరాభవం ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర.
ఫుల్ రన్లో కనీసం 20 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేకపోయిందా చిత్రం. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇబ్బంది పరిస్థితి తప్పట్లేదు. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి విజయం తర్వాత రణబీర్ కపూర్ నటించిన ‘తూ ఝూతి మై మక్కర్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లేదు.
రణబీర్ సరసన శ్రద్ధా కపూర్ లాంటి పెద్ద హీరోయిన్ నటించింది. ఈ సినిమా ట్రైలర్ రొమాంటిక్ సినిమాల ప్రియులను బాగానే ఆకట్టుకుంది. కానీ రిలీజ్ ముంగిట అనుకున్నంత బజ్ తెచ్చుకోని ఈ చిత్రానికి.. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో వచ్చేలా లేవు. తొలి రోజు పది కోట్ల వసూళ్లు కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోందని బాలీవుడ్ జనాలు ఫీలవుతున్నారు.
This post was last modified on March 8, 2023 10:29 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…