మన సినిమాలు అమెరికాలోనో యుకెలోనో బాగా ఆడితే అందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి లేదు. కానీ మన నేటివిటీతో ఎంతమాత్రం సంబంధం లేని జపాన్ లో విరగబడి ఆడటం మాత్రం చిన్న విషయం కాదు. ముఖ్యంగా రాజమౌళి ఆ దేశపు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే ఇంకెవరికీ అది సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే నెంబర్ వన్ సింహాసనాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఇరవై ఒకటవ వారంలో అడుగుపెట్టాక కూడా ఇంకా అక్కడి థియేటర్లలో నడుస్తూనే ఉంది. 1192 మిలియన్ యెన్లతో టాప్ వన్ స్థానాన్ని సగర్వంగా అందుకుంది.
ఇప్పటిదాకా ఈ రికార్డు రజనీకాంత్ ముత్తు పేరు మీద ఉండేది. దాని వసూళ్లు 405 మిలియన్ల యెన్లు మాత్రమే. తర్వాత వరసగా మూడు నుంచి పది స్థానాల్లో బాహుబలి ది కంక్లూజన్ (305), త్రీ ఇడియట్స్ (149.6), ఇంగ్లీష్ వింగ్లిష్ (145), సాహో (131), మగధీర (130), రోబో (109.6), ధూమ్ త్రీ (104.5), ప్యాడ్ మ్యాన్ (90) ఉన్నాయి. పదకొండో ప్లేసులో బాహుబలి ది బిగినింగ్ (76) ఉండటం విశేషం. మొత్తం ఈ లిస్టులో రాజమౌళివి నాలుగు ఉండటం అసలు ట్విస్టు. ఇప్పటిదాకా ఏ ఇండియన్ డైరెక్టర్ కు ఇన్నేసి సినిమాలు ఇలా అగ్ర స్థానాల్లో ఉండటం జరగలేదు జరగబోదు.
ఆర్ఆర్ఆర్ ఇంకో యాభై రోజులు ఇదే తరహాలో జపాన్ లో జోరు చూపించడం ఖాయమని అక్కడి మీడియా రిపోర్ట్. ఒకవేళ నాటు నాటుకి కనక ఆస్కార్ వస్తే కలెక్షన్లలో అమాంతం జంప్ చూడొచ్చని అప్పుడు సులభంగా 1500 మిలియన్ యెన్ల మార్కు అందుకోవడం సులభమని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా జక్కన్న ఈ స్థాయిలో గర్వపడేలా అన్ని దేశాల్లో జయకేతనం ఎగురవేయడం చూస్తుంటే పొగడరా నీ తల్లి మాతృభారతిని అని పాడుకోవాలనిపిస్తుంది. వీటి దెబ్బకే అసలు షూటింగే మొదలుకాని రాజమౌళి మహేష్ బాబు సినిమా గురించి జపాన్ ఎంక్వయిరీలు మొదలయ్యాయట.
This post was last modified on March 8, 2023 12:59 pm
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్ను పిలిచి సింపుల్గా చేసేస్తారని అనుకున్నారంతా.…
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…