గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయం నమోదు చేసుకున్న అవతార్ 2 ది వే అఫ్ వాటర్ చిన్ని తెరపై రాబోతోంది. ఈ నెల 28న డిజిటల్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ నెంబర్ వన్ గ్రాసర్ గా రికార్డు సృష్టించిన ఈ విజువల్ వండర్ ని థియేటర్స్ లో చూసినవాళ్లు మళ్ళీ ఇంకోసారి ఇంట్లో చూసేందుకు అవకాశం దక్కబోతోంది. అయితే ఈసారి వట్టి సినిమా చూసి సంతృప్తి చెందనవసరం లేదు. ఒరిజినల్ వెర్షన్ తో పాటుగా అదనంగా 3 గంటల అదనపు ఫుటేజీని దీంతో పాటు ఉచితంగా అందించబోతున్నారు.
ఇందులో షూటింగ్ జరుగుతున్న వీడియోలు, గ్రాఫిక్స్ కి సంబంధించిన పనులను వివరించే ఇంటర్వ్యూలు, నటీనటులు సాంకేతిక నిపుణుల ముఖాముఖీ కార్యక్రమాలతో పాటు జేమ్స్ క్యామరూన్ ఇప్పటి దాకా ఎవరికీ చెప్పని అవతార్ సీక్రెట్స్ ఇందులో పొందుపరచబోతున్నారు. అంతే కాదు మూడు నాలుగు భాగాలకు సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ ఇస్తారు. మొత్తం ఆరున్నర గంటలు నాన్ స్టాప్ గా పండోరా ప్రపంచంలో మునిగి తేలి రావొచ్చు. ఇది ఏ ఓటిటిలో వస్తుందనే విషయం చెప్పలేదు కానీ తొలుత బ్లూరే డిస్క్, డివిడి రూపంలో రిలీజ్ చేశాక రెగ్యులర్ డిజిటల్ కి రావొచ్చు.
సరిగ్గా వంద రోజులకు అవతార్ 2 స్మార్ట్ స్క్రీన్లకు వచ్చేస్తుంది. ఇండియాకు కొంచెం లేట్ కావొచ్చనే టాక్ ఉంది కానీ ఒకవేళ అలా జరిగినా పైరసీ దారులు ఊరికే ఉంటారా. ఇప్పటికీ ఈ సినిమా మన దేశంలో ప్రధాన నగరాల్లో ఇంకా స్క్రీనింగ్ కొనసాగిస్తూనే ఉంది. హైదరాబాద్ లోనూ షోలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆస్కార్ నామినేషన్లలో ఆధిపత్యం చూపిస్తున్న అవతార్ 2 ఏ విభాగాల్లో అవార్డు తెస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 16 వేల కోట్ల బ్రేక్ ఈవెన్ ఈజీగా అందుకున్న క్యామరూన్ మాయాజాలం తర్వాత భాగానికి ఎంత టార్గెట్ పెట్టుకుంటుందో.
This post was last modified on March 8, 2023 10:53 am
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…