కొన్ని కాంబినేషన్లు వినగానే విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు గురి చేస్తాయి. ఇక నిజమయ్యే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఫ్యాన్స్ ఉద్వేగం ఏ స్థాయికి చేరుకుంటుందో వేరే చెప్పాలా. ఆర్ఆర్ఆర్ అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. తీరా ఇప్పుడు చూస్తే దాదాపు ఆస్కార్ గెలిచినంత పని చేసింది. మార్చి 12 అవార్డు వచ్చినా రాకపోయినా అంతకన్నా గొప్ప ఖ్యాతి రాజమౌళి బృందం ఇప్పటికే సంపాదించేసింది. తాజాగా మరో కలయిక గురించిన వార్తలు చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ధనుష్ కాంబినేషన్ లో కల్ట్ దర్శకుడు వెట్రిమారన్ ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేశారనేది దాని సారాంశం. రేపు జరగబోయే విడుతలై ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దీన్ని ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. వెట్రిమారన్ తారక్ తో కొన్ని నెలల క్రితం నుంచే సంప్రదింపుల్లో ఉన్న మాట వాస్తవమే. అలాగే ధనుష్ తోనూ రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నాడు. ఇది ఒకే కథ గురించా లేక ఇద్దరు హీరోలతో వెట్రిమారన్ వేర్వేరుగా ప్లాన్ చేసుకున్నాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపు ఒకవేళ ఖరారు కాకపోయినా భవిష్యత్తులో జరుగుతుంది
వెట్రిమారన్ ముందు నుంచే వడ చెన్నై 2 తీసే ప్లాన్ లో ఉన్నాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశారట. ఇది తెలుగులో రాలేదు కానీ కోలీవుడ్ లో వచ్చిన బెస్ట్ గ్యాంగ్ స్టర్స్ మూవీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. దానికి కొనసాగింపనే లీకే ట్విట్టర్ లో ట్రెండింగ్ కి తీసుకొచ్చింది. మరి వెట్రిమారన్ ఇద్దరినీ ఇందులోనే సెట్ చేస్తాడా లేక వేరు వేరు సబ్జెక్టులు సిద్ధం చేశారా అనేది తెలియాల్సి ఉంది. జూనియర్ యుఎస్ నుంచి రాగానే కొరటాల శివ రెగ్యులర్ షూట్ కి వెళ్ళిపోవాలి. అది కాగానే ప్రశాంత్ నీల్ ది ఉంటుంది. మరి తమిళ దర్శకుడికి నిజంగా ఎస్ చెప్పాడా అనేది ప్రస్తుతానికి ప్రశ్నే
This post was last modified on March 8, 2023 7:53 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…