ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథతో కాస్త డీసెంట్ సక్సెసే అందుకున్న కిరణ్ అబ్బవరం రెండు నెలలు తిరక్కుండానే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 7న మీటర్ థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. మైత్రి లాంటి పెద్ద నిర్మాణ సంస్థ భాగస్వామ్యం ఉన్నా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే దాకా అసలు సౌండ్ చేయని ఈ మీటర్ సడన్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషమే. రమేష్ కడూరి దర్శకత్వం వహించిన ఈ పోలీస్ డ్రామా తనకు మాస్ ఇమేజ్ తీసుకొస్తుందని కిరణ్ అబ్బవరం చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇవాళ టీజర్ లాంచ్ జరిగింది.
అనగనగా ఓ కుర్ర ఎస్ఐ(కిరణ్ అబ్బవరం). ఏ మాత్రం బాధ్యత లేకుండా జాలీగా ఉద్యోగం చేస్తూ తోచినట్టు చేస్తూ నచ్చినట్టు ఉంటాడు. ఆఖరికి పై అధికారి నువ్వీ జాబ్ కి అన్ ఫిట్ అన్నా సరే హ్యాపీగా ఇంటికి పంపించేయండని అంటాడు. పైగా తనకో అసిస్టెంట్ (సప్తగిరి) ని పెట్టుకుని చక్కర్లు కొడతాడు. ఇలాంటి ఖాకీవాడి జీవితంలోకి ఒక విలన్ ఎంట్రీ ఇస్తాడు. ముందు తేలిగ్గా తీసుకున్న పోలీస్ కుర్రోడు వాడెంత ప్రమాదకరమైన వాడో గుర్తించాక ఫేస్ టు ఫేస్ ఎదురుకోవాలని నిర్ణయించుకుని సీరియస్ మీటర్ లోకి మారతాడు. ఆ తర్వాత జరిగేదే అసలైన కథ.
టీజర్ లో చూపించిన ప్రకారం స్టోరీ లైన్ రెగ్యులర్ పోలీస్ ఫార్ములాలోనే సాగింది. కాకపోతే కిరణ్ లాంటి అప్ కమింగ్ యువకుడితో ఇలాంటి హెవీ క్యారెక్టర్ చేయించడం కొత్తగా ఉంది. హీరోయిన్ అతుల్యా రవితో లవ్ ట్రాక్, హీరో విలన్లు పరస్పరం ఛాలెంజ్ చేసుకోవడం గతంలో చూసిందే. ట్రైలర్ వచ్చాక ఇందులో ఎంతమేరకు వైవిధ్యం ఉందో క్లారిటీ వస్తుంది. సాయి కార్తీక్ సంగీతం, వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్న మీటర్ ఏప్రిల్ 7న సోలోగా రావడం లేదు. మాస్ మహారాజా రవితేజ రావణాసుర, దగ్గుబాటి అభిరాం అహింసలతో పోటీ పడాల్సి ఉంటుంది.
This post was last modified on March 7, 2023 4:54 pm
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…