Movie News

క్రేజీ రూమర్.. బాలయ్య సినిమాలో బెల్లంకొండ

సినీ రంగంలో కొత్త కాంబినేషన్ల గురించి రూమర్లు ఎప్పుడూ ఉండేవే. కానీ అందులో అన్నీ ఎగ్జైట్మెంట్ కలిగించవు. కొన్ని ఊహాగానాలు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. ఇప్పుడు అలాంటి రూమరే టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలో యువ కథానాయకుడు బెల్లంకొండ నటిస్తున్నాడన్నదే ఆ సమాచారం. గత ఏడాది మూడు పెద్ద డిజాస్టర్లతో బాగా ఇబ్బంది పడ్డ బాలయ్య.. ప్రస్తుతం తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి గత నెలలో రిలీజైన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా హీరోయిన్లెవరో ఖరారు కాని ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్‌లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉంటుందని.. దాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేయిస్తే సినిమాకు డిఫరెంట్ లుక్ వస్తుందని బోయపాటి భావిస్తున్నాడని.. ఇందుకు బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. శ్రీనివాస్ కూడా సంతోషంగా ఒప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదెంత వరకు నిజమో కానీ.. ఈ కాంబినేషన్ అందరినీ కళ్లు విచ్చుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే బెల్లంకొండ కుటుంబంతో బాలయ్య బంధం చిత్రమైనది. ఒకప్పుడు బెల్లంకొండ సురేష్ బాలయ్యకు అత్యంత సన్నిహితుడు. కానీ ఎక్కడో తేడా కొట్టి సురేష్‌పై బాలయ్య కాల్పులు జరిపే వరకు వెళ్లింది. ఆ కేసు అనేక మలుపులు తిరిగి చివరికి ఇద్దరి మధ్య రాజీ కుదిరింది. బాలయ్య బయటపడ్డాడు.

మళ్లీ బాలయ్యతో సురేష్‌కు ప్యాచప్ అయ్యి ఆయనతో ‘హరహర మహాదేవ’ అనే సినిమా కూడా తీయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత వీళ్లిద్దరి రిలేషన్ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడిలా బాలయ్య సినిమాలో బెల్లంకొండ జూనియర్ నటిస్తాడన్న రూమర్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ లాంటి భారీ సినిమా తీసి బెల్లంకొండ కుటుంబానికి బోయపాటి సన్నిహితుడిగా మారిన నేపథ్యంలో ఈ రూమర్‌ను కొట్టిపారేయడానికి కూడా లేదేమో.

This post was last modified on July 28, 2020 8:54 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

7 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

8 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

8 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

8 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

10 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

11 hours ago