నందమూరి కుటుంబంలో మూడో తరం హీరోల్లో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పెద్ద రేంజికి వెళ్లాడు. కళ్యాణ్ రామ్ కొంచెం తడబడుతూనే.. అప్పుడప్పుడూ ఓ హిట్ కొడుతూ మిడ్ రేంజ్ హీరోగా కొనసాగుతున్నాడు. తారకరత్న హీరోగా సక్సెస్ కాలేక సినిమాలే మానేశాడు. వీరు కాక చైతన్యకృష్ణ అనే మరో నందమూరి హీరో కూడా సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరైన జయకృష్ణ కొడుకే ఈ చైతన్యకృష్ణ.
గతంలో ‘ధమ్’ అనే సినిమాతో పాటు ఇంకేదో చిన్న సినిమా ఒకటి చేశాడు. కానీ అవేవీ ఫలితాన్నివ్వలేదు. చాలా ఏళ్ల నుంచి అతను సినిమాలకు దూరంగానే ఉంటున్నాడు. కానీ గత ఏడాది బసవతారకమ్మ క్రియేషన్స్ పేరుతో కొత్త బేనర్ పెట్టి తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు చైతన్యకృష్ణ.
ఈ సినిమా చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. చైతన్యకృష్ణ తొలిసారి లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రానికి ‘బ్రీత్’ అనే టైటిల్ పెట్టారు. ‘అంతిమ పోరాటం’ అనేది ఉపశీర్షిక. చైతన్యకృష్ణ తండ్రి జయకృష్ణే ఈ చిత్రానికి నిర్మాత. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించాడు. ఫార్మల్ డ్రెస్.. టై.. గడ్డం.. కళ్లజోడుతో వర్షంలో గొడుగు పట్టుకున్న చైతన్యకృష్ణ గత సినిమాలతో పోలిస్తే బెటర్ లుక్‌తో కనిపించాడు ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో.
చైతన్య ఇంతకుముందు చేసిన సినిమాల్లో తన లుక్స్, వాయిస్, యాక్టింగ్ చాలా పేలవంగా అనిపించాయి. తన పాత్రలు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇలాంటి నేపథ్యం ఉన్న హీరో ఇన్నేళ్ల తర్వాత మళ్లీ హీరోగా నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ఈ నందమూరి హీరోకు రీఎంట్రీలో ప్రేక్షకుల నుంచి ఏమాత్రం ఆమోదం దక్కుతుందో చూడాలి.
This post was last modified on March 7, 2023 2:59 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…