కొన్ని సినిమాలు రిలీజైనప్పుడు మామూలుగానే అనిపించినా.. పోను పోను ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. కరోనా టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన తమిళ సినిమా ‘సార్పట్ట’ ఈ కోవకే చెందుతుంది.
రజినీకాంత్‌తో ‘కబాలి’; ‘కాలా’ చిత్రాలు తీసిన తమిళ దర్శకుడు పా.రంజిత్ రూపొందించిన ఈ చిత్రంలో ఆర్య లీడ్ రోల్ చేశాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ ఫిలిం రిలీజైనప్పటి కంటే.. తర్వాతి కాలంలో ఎక్కువ అప్లాజ్ తెచ్చుకుంది.
కొన్ని దశాబ్దాల ముందటి నేపథ్యంతో రంజిత్ తీసిన ఈ బాక్సింగ్ డ్రామా.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. తమిళనాట చాలా ఏళ్ల ముందు లోకల్ బాక్సింగ్ పోటీల నేపథ్యాన్ని రంజిత్ చాలా అథెంటిగ్గా తీసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. హీరోతో పాటు ఇందులోని వివిధ పాత్రలను రంజిత్ భలేగా తీర్చిదిద్దాడు.
కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న ‘సార్పట్ట’ సినిమాకు సీక్వెల్ తీస్తానని రంజిత్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇప్పుడు అతను ఆ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. కపిలన్ (హీరో పాత్ర పేరు) త్వరలోనే తిరిగి వస్తున్నాడంటూ ఒక పోస్టర్ ద్వారా సినిమాను ప్రకటించాడు రంజిత్. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలై.. చాలా వరకు టాకీ పార్ట్ పూర్తయినట్లు తెలుస్తోంది.
ఐతే అప్పట్లో కరోనా ప్రభావం వల్ల తప్పక థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేశారు. ఇప్పుడు మామూలు పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ‘సార్పట్ట-2’ థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. ఒక కల్ట్ మూవీకి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి సార్పట్ట కథను రంజిత్ ఈసారి ఎన్ని మలుపులు తిప్పుతాడు.. ప్రేక్షకులకు బాగా ఎక్కేసిన క్యారెక్టర్లను ఈసారి ఎలా ప్రెజెంట్ చేస్తాడు అన్నది ఆసక్తికరం. వేసవిలోనే ఈ సినిమా రిలీజ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.
This post was last modified on March 9, 2023 5:56 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…