గత రెండు వారాలుగా బాక్సాఫీస్ చాలా నత్తనడకన ఉంది. ఫిబ్రవరి మూడో వారంలో వచ్చిన సార్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విజయం నమోదు కాలేదు. బలగం హిట్ అయ్యింది కానీ దాని ప్రభావం తెలంగాణకే పరిమితం కావడంతో ఏపి వసూళ్లు రెండో వారానికే ప్యాకప్ చెప్పేలా ఉన్నాయి. ముఖ్యంగా వీక్ డేస్ లో పరిస్థితి కష్టమే అనిపిస్తోంది. ఈ నెల చివర్లో వచ్చే నాని దసరా కన్నా ముందు కాస్త ఊపు తీసుకొచ్చే స్ట్రెయిట్ తెలుగు మూవీ ఒకటి అర్జెంట్ గా కావాలి. అంతో ఇంతో చెప్పుకోదగ్గది ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మాత్రమే కనిపిస్తోంది.
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందింది. కళ్యాణి మాలిక్ పాటలకు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి సపోర్ట్ దక్కుతోంది. చాలా కాలం తర్వాత చక్కని మెలోడీ ఆల్బమ్ వింటున్నామని మెచ్చుకుంటున్నారు. కానీ మార్చి 17న జనాన్ని థియేటర్లకు రప్పించేందుకు ఈ ఒక్క అంశం సరిపోదు. టీజర్ చూస్తేనేమో ఇది పూర్తిగా యూత్ కి టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అవసరాల అప్పుడెప్పుడో తీసిన ఊహలు గుసగసలాడే షేడ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇప్పటి ఆడియన్స్ అభిరుచుల్లో భారీ మార్పొచ్చింది.
సో జనంలో ఆసక్తి రేగేలా అబ్బాయి అమ్మాయి ఏదో రకంగా ప్రమోషన్ మేజిక్ చేయాల్సిందే. అదే రోజు శాండల్ వుడ్ ప్యాన్ ఇండియా మూవీ కబ్జా వస్తోంది. కెజిఎఫ్ ఛాయలు కనిపిస్తున్నా మాస్ జనాలు దాటికి ఓటు వేసే ఛాన్స్ ఎక్కువ. సో ఇటు వైపు లాక్కోవాలంటే సంథింగ్ స్పెషల్ అనిపించేది తన సినిమాలో ఉందని అవసరాల శ్రీనివాస్ బలమైన మెసేజ్ ఇవ్వాలి. ఆపై వారం బెదురులంక లాంటి చిన్న చిత్రాలే ఉండటంతో పాజిటివ్ టాక్ వస్తే కనక నాగ శౌర్య మూవీకి ఓ పది రోజులు సేఫ్ రన్ దక్కుతుంది. అసలే హిట్టు లేక చాలా కాలమయ్యింది. ఇదే బ్రేక్ ఇవ్వాలి.
This post was last modified on March 7, 2023 12:10 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…