మాములుగా బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు పెద్దగా మార్పులు చేయరు. ఏ మాత్రం తేడా కొట్టినా ఒరిజినల్ సోల్ ని చంపేశారనే విమర్శలు వస్తాయని. అలా అని చేంజ్ చేయకుండా తీసినవి డిజాస్టర్ కావన్న గ్యారెంటీ కూడా లేదు. ఇటీవలే అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ హిందీలో షెహజాదాగా చేస్తే కనీసం సగం పెట్టుబడి కూడా రాలేదు. అయితే అజయ్ దేవగన్ మాత్రం తన కొత్త చిత్రం భోలా విషయంలో పెద్ద రిస్క్ చేస్తున్నాడు. ఇది ఈ నెల 30న విడుదల కానుంది. అభిమానులకు దీని మీద బోలెడు అంచనాలున్నాయి.
ఈ భోలా కార్తీ ఖైదీ అఫీషియల్ రీమేక్. ఇవాళే ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల ఆధారంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ దాన్ని ఎంత ఇంటెన్స్ గా తీశాడో ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకపోయినా ఆడియన్స్ థియేటర్స్ లో థ్రిల్ అవుతూ చూశారు. అయితే అజయ్ దేవగన్ బాలీవుడ్ వెర్షన్ కి లెక్కలేనన్ని మార్పులు చేర్పులు చేశాడు. ఐటెం సాంగ్ పెట్టాడు. నమ్మశక్యం కాని పఠాన్ టైప్ పోరాట దృశ్యాలు తీశాడు. హీరోయిన్ తో ఫ్లాష్ బ్యాక్, ఆమెతో ఆటా పాటా కూడా జోడించాడు. ఇవేవి ఖైదీలో లేవు.
పోలీస్ ఆఫీసర్ గా టబుని తీసుకొచ్చాడు. పగలు వచ్చే ఎపిసోడ్స్ ని పెట్టాడు. ఇలా మొత్తానికి కిచిడి సరుకు గట్టిగానే దింపాడు. ఇవన్నీ చాలవన్నట్టు ఏకంగా 3డిలో ప్రెజెంట్ చేయబోతున్నాడు.ఆ మధ్య దృశ్యం 2తో భారీ విజయం అందుకున్న అజయ్ దేవగన్ కు ఆ కాన్ఫిడెన్స్ కాబోలు ఇప్పుడీ ఖైదీ మేకోవర్ కు ప్రేరేపించింది. రన్ వే 34 తర్వాత అజయ్ దేవగన్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించుకున్న సినిమా ఇది. పఠాన్ తుఫాను తర్వాత మళ్ళీ డల్ అయిపోయిన బాక్సాఫీస్ కు ఇదే సరైన ఉత్సాహం తెస్తుందని ట్రేడ్ గంపెడాశలుతో ఎదురు చూస్తోంది.
This post was last modified on March 7, 2023 7:57 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…