కెజిఎఫ్ లో రాఖీ భాయ్ పాత్ర గురించి దర్శకుడు వెంకటేష్ మహా చేసిన కామెంట్లు పెను దుమారానికి దారి తీశాయి. దాని తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి. ఆ గ్రూప్ ఇంటర్వ్యూలో మరో నలుగురు డైరెక్టర్లు పాల్గొనడమే కాక ఆ వ్యాఖ్యలకు మద్దతుగా పగలబడి నవ్వడంతో ఇప్పుడు అందరూ టార్గెట్ అయిపోయారు. దెబ్బకు నందినిరెడ్డి సారీ చెబుతూ కమర్షియల్ సినిమాకు గౌరవం ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ చేయడం బట్టి వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి వెంకటేష్ మాములుగా తన వెర్షన్ వినిపించే ఉంటే బాగుండేది కానీ మరీ వెటకారంగా విమర్శించడమే ఈ వివాదానికి కారణం.
కుర్ర డైరెక్టర్లు ఇలాంటి ముఖాముఖీలు చేసే ముందు చాలా ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే ఏదైనా విషయంలో నెగటివ్ గా ట్రిగ్గర్ అయ్యామంటే దాని ప్రభావం నేరుగా వాళ్ళ రాబోయే కొత్త రిలీజు మీద ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు కావాలని ట్రోలింగ్ కోసం టార్గెట్ చేసి మరీ తప్పొప్పులు ఎత్తి చూపిస్తారు. ముఖ్యంగా నాలుగైదు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న యూత్ ఫిలిం మేకర్స్ ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మాటలు గాల్లో కలిసిపోతాయేమో కానీ వీడియోలు శాశ్వతం. ఇంకో యాభై ఏళ్ళ తర్వాతైనా సరే అదిగో నువ్వు ఫలానా సంవత్సరం ఇలా అన్నావని వేలెత్తి చూపించడానికి సాక్ష్యం సిద్ధంగా ఉంటుంది. ఇదే అసలు సమస్య
ఇప్పుడీ టాపిక్ కన్నడ ఫ్యాన్స్ దాకా వెళ్ళింది. ఏదో ఆషామాషీ మాములు మసాలా సినిమాని అనుంటే లైట్ తీసుకునేవాళ్ళు కానీ ఏకంగా కెజిఎఫ్ 2ని క్రిటిసైజ్ చేయడంతో ఇప్పుడా బ్యాచ్ రంగంలోకి దిగింది. చేయాల్సిన ప్రయాణం అందుకోవాల్సిన ఎత్తులు చాలా ఉన్న కుర్ర డైరెక్టర్లు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూసుకోవాలి. మన పనితనం మాట్లాడాలి కానీ వేరొకరి క్రియేటివిటీని పోస్ట్ మార్టం చేయడం వల్ల హైలైట్ కాకూడదు. ఈ ఇష్యూ వల్ల ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి సీనియర్ దర్శకులు సైతం ఈ కాంట్రావర్సిలో వచ్చేశారు. యాటిట్యూడ్ అంటే సినిమాల్లో ఎలా చూపించినా చెల్లుతుంది కానీ రియల్ లైఫ్ లో కుదరదు. అందుకే జర భద్రంగా ఉండాల్సిందే
This post was last modified on March 6, 2023 9:54 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…