ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఒక సినిమా కథ బయటికి రాకుండా కాపాడుకోవడం అంటే పెద్ద టాస్కే. సినిమా సెట్స్ పై వుండగానే ఫలానా సినిమా ఇదే కథతో రాబోతుంది అంటూ లీకులు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా బాలయ్య నెక్స్ట్ సినిమా గురించి కూడా ఓ లీక్ వినిపిస్తుంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇందులో బాలయ్య గొడవల కారణంగా 14 ఏళ్ళు జైలులో ఉంటాడట. మళ్లీ అరవై ఏళ్ల తర్వాత శిక్ష పూర్తి చేసుకొని బయటికి వస్తాడట. వచ్చాక బాలయ్య నడవడిక ఎలా ఉంటుంది ? అతనిలో వచ్చిన మార్పెంటి? అనే కథతో సినిమా తెరకెక్కుతుందని వినిపిస్తుంది. సినిమా కథంతా తెలంగాణ నేపథ్యంలో ఉండబోతుందని, బాలయ్య ఇందులో తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ కొత్తగా ఎంటర్టయిన్ చేస్తాడని అంటున్నారు.
బాలయ్య సరసన కాజల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. శ్రీ లీల ఇందులో బాలయ్య కూతురి పాత్రలో నటించనుంది. సన్ షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న మొట్ట మొదటి పెద్ద సినిమా ఇది. ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య తో ఎప్పటి నుండో సినిమా అనుకుంటున్న అనిల్ రావిపూడి ఇందులో సరికొత్త బాలయ్య ను చూపించబోతున్నాడు.
This post was last modified on March 6, 2023 5:52 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…