మంచు మనోజ్ రెండో పెళ్లి అందరిలోనూ అమితాసక్తిని రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి మనోజ్ తండ్రి మోహన్ బాబుకు, అన్న విష్ణుకు ఇష్టం లేదని.. అందుకే పెళ్లిలో అంటీ ముట్టనట్లు ఉన్నారని.. తన అక్క లక్ష్మీప్రసన్న మద్దతుతో మనోజే పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాడని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఐతే ఈ విషయాలపై మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. కాగా భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి పెళ్లి అనంతరం ముందుగా కర్నూలులోని తన అత్తవారింటిని సందర్శించిన మనోజ్.. తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చాడు. ఈ సందర్భంగా తన పెళ్లి విషయమై అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జీవితంలో ఓడిపోవచ్చు కానీ.. ప్రేమలో ఓడిపోకూడదు. నేడు మా ప్రేమ గెలిచింది. మా నాన్న గారి ఆశీస్సులు, అక్క మద్దతు, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు’’ అని మనోజ్ వ్యాఖ్యానించాడు.
అంతే కాక మనోజ్.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. మనోజ్ లాగే మౌనికకు కూడా ఇది రెండో పెళ్లి కాగా.. మౌనికకు తొలి పెళ్లి ద్వారా ఒక కొడుకు పుట్టాడు. ఈ కొడుకును తన బిడ్డలా స్వీకరిస్తూ మనోజ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘నేను, మౌనిక, బాబు కొత్త జీవితంలోకి అడుగు పెట్టాం.
కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటే ఇదేనేమో శివుడి ఆజ్ఞతోనే అన్నీ జరిగాయని అనుకుంటున్నా. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అలా నా జీవితంలోకి మౌనిక వచ్చింది. గత నాలుగేళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. నా సినిమాల షూటింగ్స్ వరుసగా ఆరంభం కాబోతున్నాయి. సినిమాల్లో బిజీ కాబోతున్నా. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. ప్రజలకు సేవ చేయాలని మాత్రం ఉంది. మౌనిక కోరుకుంటే తనకు సపోర్ట్ చేస్తా’’ అని మనోజ్ పేర్కొన్నాడు.
This post was last modified on March 6, 2023 5:50 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…