ఇప్పుడున్న ఇండియన్ మూవీ యాక్టర్స్ లో అత్యంత విలక్షణ నటుల పేర్లు చెప్పమంటే అందులో నవాజుద్దీన్ సిద్ధిక్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అంతటివారి సినిమాలో ఏరికోరి విలన్ గా చేయించడమంటే మాటలు కాదు. పేటకు తనెంత ప్లస్ అయ్యాడో చూశాం. ఇటీవలే వెంకటేష్ సైంధవ్ ఒప్పుకోవడం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా కెరీర్ పీక్స్ ని ఎంజాయ్ చేస్తున్న నవాజుద్దీన్ కి రియల్ లైఫ్ మాత్రం తెరమీద కనిపించినంత అందంగా లేదు. ముఖ్యంగా భార్య అలియాతో విడిపోయిన వ్యవహారం పెద్ద రచ్చకే దారి తీసింది.
ప్రస్తుతం నవాజుద్దీన్ గురించి ముంబై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. స్వంత కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నాడని భారీ విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఎట్టకేలకు దీనికి సుదీర్ఘ వివరణ ఇచ్చాడు సిద్ధిక్. కొన్నేళ్ల క్రితమే భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. పిల్లలు ఇక్కడే చదువులు కొనసాగిస్తున్నారు. అయితే నలభై అయిదు రోజులుగా వాళ్ళు స్కూల్ కి రావడం లేదని మెసేజ్ రావడంతో నవాజుద్దీన్ ఖంగారు పడిపోయాడు. ఏంటా అని ఆరా తీస్తే వాళ్ళను తల్లి దుబాయ్ కి తీసుకెళ్లిపోవడం వల్ల ఇదంతా జరిగినట్టు అర్థమయ్యింది.
నెలవారీ భత్యం కింద 10 లక్షల రూపాయలను రెండేళ్లుగా ఇతను భరిస్తూనే ఉన్నాడు. స్కూల్ ఫీజులు మెడికల్ ఖర్చులు ఇతరత్రా వ్యయాలు అదనం. వీళ్ళ కోసం దుబాయ్,ముంబైలో నవాజుద్దీన్ ఖరీదైన ఫ్లాట్లు కొనిపెట్టాడు. అయినా ఆమె ఆశ తీరక ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తోందన్నది ఇతని వెర్షన్. శారా, యాని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆందోళన చెందుతూ నవాజుద్దీన్ సిద్ధిక్ చాలా వివరంగా ఇదంతా చెప్పుకొచ్చాడు. చట్టపరంగా న్యాయం కోసం పోరాడతానని చెబుతున్నాడు. మొత్తానికి స్క్రీన్ పైన ఎక్కువగా రియల్ లైఫ్ లో డ్రామా ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదేమో
This post was last modified on March 6, 2023 5:48 pm
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…