ఆహాకు అన్ స్టాపబుల్ షో తీసుకొచ్చిన మైలేజ్ అంతా ఇంతా కాదు. మొదటిసారి యాంకరింగ్ ఎలా చేస్తారోననే అనుమానాలు బద్దలు కొడుతూ ఈ సెలబ్రిటీ ముఖాముఖీ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. సెకండ్ సీజన్ మొదట్లో పొలిటికల్ కలర్ ఇవ్వడం పట్ల మిశ్రమ స్పందన వచ్చినా చివర్లో ప్రభాస్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఎపిసోడ్లు దీని స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోయాయి. ఒక సినిమా రిలీజ్ అవుతున్న రేంజ్ లో వీటిని స్పెషల్ గా థియేటర్ స్క్రీనింగ్ చేయడం టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పొచ్చు
ఈ ఊపులోనే బాలయ్యతో ఒక వెబ్ సిరీస్ చేయించేందుకు అల్లు అరవింద్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అయితే ముందు కథ వింటానని తర్వాత అలోచించి నిర్ణయం చెబుతాననే స్పందన వచ్చిందట. టాలీవుడ్ నలుగురు సీనియర్ స్టార్ హీరోల్లో ఫస్ట్ డిజిటల్ డెబ్యూ విక్టరీ వెంకటేష్ చేశారు. మార్చి 10 నుంచి స్ట్రీమింగ్ కానున్న రానా నాయుడు ఫలితం చూశాక ఆయన ఎంట్రీ సక్సెస్ అయ్యిందా లేదా తేలుతుంది. నాగార్జున కూడా చేయాలని అంతకు ముందు ఆసక్తి చూపించారు కానీ వరసగా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో డ్రాప్ అయ్యారు
సో బాలయ్యను మెప్పించే బాధ్యతను అరవింద్ తన టీమ్ కు అప్పజెప్పారట. ముందు స్క్రిప్ట్ ఓకే అయితే దర్శకుడిని లాక్ చేసుకోవచ్చు. బివిఎస్ రవి పేరు ముందు వరసలో ఉంది. థియేటర్ కంటెంట్ కాదు కాబట్టి కొంచెం అనుభవమున్న దర్శకుడు ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. ప్రస్తుతం ఆ వేట కూడా జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. బాలకృష్ణ అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నారు. తారకరత్న మరణం వల్ల కొత్త షెడ్యూల్ వాయిదా పడింది. ఈ వారంలోనే రీ స్టార్ట్ చేయబోతున్నారు. మరి అల్లు బృందానికి గ్రీన్
This post was last modified on March 6, 2023 5:46 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…