రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపుమీదున్న మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా రావణాసుర ఏప్రిల్ 7 విడుదలకు రెడీ అవుతోంది. కేవలం నాలుగు నెలల గ్యాప్ లో ఒక స్టార్ హీరో మూడో సినిమా రిలీజ్ కావడం గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదు. దీంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన రావణాసుర టీజర్ ని ఇందాకా రిలీజ్ చేశారు. నెగటివ్ షేడ్స్ ఉంటాయని ముందు నుంచే క్లూలు ఇచ్చిన నేపథ్యంలో దీని మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. వీడియోలో కథేంటో చూచాయగా చెప్పే ప్రయత్నం చేశారు.
నగరంలో క్రైమ్స్ జరుగుతుంటాయి. అమ్మాయిల హత్యలు చేస్తున్నది ఎవరో అంతుచిక్కని పరిస్థితిలో ఓ పోలీస్ అధికారి(జయరాం) రంగంలోకి దిగుతాడు. ఈ కేసుకి రెండు రూపాల్లో కనిపిస్తున్న రావణాసురుడి(రవితేజ)కున్న సంబంధం ఏంటో ప్రపంచానికి తెలియదు. మరోవైపు ఈ పద్మవ్యూహంలో అడుగుపెట్టిన మరో యువకుడు(సుశాంత్)మీదా అనుమానం మొదలవుతుంది. సీతను దాటాలంటే ముందు రావణాసురుడిని దాటాలని సవాల్ విసిరిన హీరో వెనుక ఉన్న కథ ఏంటి, నిజంగా ఆ మర్డర్లు చేసింది ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.
విజువల్స్ లో డెప్త్ కనిపిస్తోంది. రవితేజ ఇంత సీరియస్ నెగటివ్ రోల్ గతంలో చేయకపోవడంతో ఇది కొత్తగా అనిపిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తరహాలో కాకుండా క్రైమ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం బాగుంది. హీరోయిన్లు అను ఇమ్మానియేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ లను స్పీడ్ షాట్స్ లో హడావిడిగా చూపించారు. పాత్రలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా రిలీజ్ చేయలేదు. భీమ్స్ సిసిరోలియో – హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ థ్రిల్లర్ ఏప్రిల్ 7న కిరణ్ అబ్బవరం మీటర్, అభిరాం అహింసలతో పాటు విడుదల కానుంది.
This post was last modified on March 6, 2023 11:34 am
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…