ఆ హీరో ఏమీ పేరున్న వాడు కాదు. అతణ్ని చూస్తే కమెడియన్ తరహాలో కనిపిస్తాడు. కానీ చేసిందేమో విపరీతమైన ఎలివేషన్లు ఉన్న పెద్ద యాక్షన్ సినిమా. ఒకరికి ఇద్దరు దర్శకులు కలిసి ఆ సినిమా తీశారు. రూపాయి మార్కెట్ లేని హీరో మీద ఏకంగా పాతిక కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారు. సినిమాలో విషయం ఉందా అంటే అదేమీ లేదు. కేవలం హీరో పెద్ద వ్యాపారవేత్త, అతడి దగ్గర వందల కోట్లు ఉన్నాయి కదా అని.. ముచ్చట తీర్చేసుకున్నాడు. ఈ ఉపోద్ఘాతం అంతా ‘ది లెజెండ్’ సినిమా గురించే అని ఈపాటికి అర్థమైపోయి ఉంటుంది.
తన పేరు వెనుక తనే ‘లెజెండ్’ అని తగిలించుకున్న శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ సొంత బేనర్లో తనే హీరోగా ఈ భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసుకున్నాడు. జేడీ-జెర్రీ అనే ఇద్దరు దర్శకులు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో శరవణన్ విన్యాసాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
గత ఏడాది థియేటర్లలో రిలీజైనపుడు విపరీతంగా ట్రోల్ అయిన ఈ సినిమా.. ఓటీటీలోకి అంత సులువుగా రాలేదు. కేవలం ట్రోల్ చేయడానికే చాలామంది డిజిటల్ రిలీజ్ కోసం చూడగా.. వాళ్ల ఆశలపై నీళ్లు చల్లాడు శరవణన్. ఎంతకీ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవ్వలేదు. ఇక ఆశలు వదులుకున్న టైంలో ఈ నెల 3న సడెన్‌గా హాట్ స్టార్‌లోకి వచ్చేసింది ‘ది లెజెండ్’. ఈ విషయం కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్‌గా మారిపోయింది.
సోషల్ మీడియాలో ఏ చిన్న పాయింట్ దొరికినా మీమ్స్‌తో రెచ్చిపోయే బ్యాచ్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఉంది. హాట్ స్టార్ లాంటి పెద్ద ఓటీటీలో ఒక రోజంతా నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయిందంటే ‘ది లెజెండ్’ పట్ల జనాల ఆసక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శరవణన్ విన్యాసాలు చూసి నవ్వుకోండానికి, ట్రోల్ చేయడానికే వీళ్లంతా సినిమా చూసి ఉంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on March 5, 2023 4:14 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…