కల్ట్ క్లాసిక్ అనిపించుకున్న పాత బ్లాక్ బస్టర్లని రీ రిలీజ్ చేస్తున్నప్పుడు సరైన ప్లానింగ్ అవసరం. ఏదో రీసెంట్ గా పెద్ద హిట్ వచ్చిందనో లేదా క్రేజ్ ఉందనే కారణంతోనో హడావిడి పడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిన్న చిరంజీవి గ్యాంగ్ లీడర్ ని భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో పునఃవిడుదల చేశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ సంధ్య 70 ఎంఎం ఉదయం ఎనిమిది గంటల షో హౌస్ ఫుల్ అయిపోయింది. అభిమానులు తండోపతండాలుగా వచ్చి సంబరంగా సినిమా చూశారు. అయితే ఇదే సీన్ ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి చోటా ఉందనుకుంటే పూర్తిగా పప్పులో కాలేసినట్టే.
ఎందుకంటే చాలా సెంటర్స్ లో గ్యాంగ్ లీడర్ కి కనీస స్పందన దక్కలేదు. సరైన ప్రమోషన్ చేయలేకపోయారు. 4కె ప్రింటని ఊదరగొట్టారు కాని తీరా స్క్రీన్ మీద చూస్తే అంత గొప్ప క్వాలిటీ లేదన్నది వాస్తవం. ముఖ్యంగా మొదటి ఇరవై నిమిషాల ప్రింట్ మరీ తీసికట్టుగా ఉంది. మధ్యలో ఉన్న ఆకుపచ్చ గీతని కూడా తీసేయలేనంత వీక్ గా వర్క్ చేశారు. యుట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ లో వచ్చేది దీనికన్నా చాలా మెరుగ్గా ఉంది. తరువాత ప్రింట్ బాగానే ఉన్నప్పటికీ బాలీవుడ్ స్థాయిలో రీ క్రియేషన్ మన దగ్గర లోపించిందన్నది వాస్తవం.
ఇక్కడో ఉదాహరణ ప్రస్తావించాలి. ఇటీవలే అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆల్ టైం క్లాసిక్స్ ని పివిఆర్ మల్టీప్లెక్సుల్లో స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. జంజీర్, దీవార్, అమర్ అక్బర్ ఆంటోనీ, కభీ కభీ లాంటివి అత్యద్భుతమైన క్వాలిటీలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి. ఇవన్నీ గ్యాంగ్ లీడర్ రిలీజైన 1991 కన్నా ఇరవై సంవత్సరాల ముందు విడుదలైనవి. కానీ అసలైన రీ మాస్టరింగ్ కి అర్థంలా నిలిచాయి. ఇవన్నీ పక్కనపెడితే మెగా మూవీని తగిన సమయం తీసుకుని సరైన రీతిలో పబ్లిసిటీ చేయకపోవడం వసూళ్లకు అడ్డం నిలిచింది.
This post was last modified on March 5, 2023 3:48 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…