టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతోమంది ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో ఉన్నారు. కానీ వాళ్లు ఉన్నారంటే ఉన్నారని చెప్పుకోవాలి తప్ప.. ఏమంత యాక్టివ్‌గా ఉండట్లేదు. ఎక్కువ మాట్లాడితే తమ ఇమేజ్ తగ్గిపోతుందేమో అన్నట్లుగా ఎక్కడ లేని నియంత్రణ పాటిస్తారు స్టార్ హీరోలు. స్పందించాల్సిన అంశాల మీద కూడా సైలెంటుగా ఉండే హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఐతే అలాంటి వాళ్లందరికీ గొప్ప పాఠమే చెబుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
గత నెల ఉగాది సందర్భంగా ట్విట్టర్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి తరానికి చెందిన చిరు ట్విట్టర్లో ఏమాత్రం యాక్టివ్‌గా ఉంటాడో.. మొక్కుబడిగా అకౌంట్ నడిపిస్తాడేమో అనుకున్నారు చాలామంది. కానీ ఆయన అరంగేట్రంలోనే అదరగొట్టేశారు. ఎంతో ఉత్సాహంగా ట్వీట్లు చేశారు. దాన్ని పీఆర్ టీం మెయింటైన్ చేస్తుండొచ్చు గాక.. కానీ అక్కడ ప్రతి మెసేజ్ చిరు ఆలోచనే అనడంలో సందేహం లేదు. ఆయన్ని సంప్రదించకుండా ఓ మెసేజ్ పోస్ట్ చేయలేరు.
గత నెల రోజుల్లో చిరు ట్విట్టర్లో చూపించిన ఉత్సాహం, ఆయన పెట్టిన మెసేజ్‌ల గురించి రాయడానికి చాలానే ఉంది. అన్నింటి గురించి ఎందుకు.. తాజాగా ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ తాను ఇంటి పనులు చేస్తున్న వీడియోను చిరు పోస్ట్ చేశారు. తాను ఎప్పుడూ చేసేదే ఇందులో చూపిస్తున్నట్లు తెలిపాడు.
చిరు దోసెలు వేయడంలో నిపుణుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ఓసారి కర్ణాటకలో షూటింగ్ కోసం వెళ్లి అక్కడో స్పెషల్ దోసె తయారీని నేర్చుకొచ్చి దానికి తన నైపుణ్యాన్ని కూడా జోడించి ఇంట్లో దాన్ని తయారు చేశారు చిరు. దాని తయారీ గురించి ఓ రెస్టారెంట్ వాళ్లు తెలుసుకుని చిరు పేరు మీద దోసె తయారు చేసి కస్టమర్లకు వడ్డిస్తుండటం విశేషం.
చిరు ఈ దోసె వేయడంలో ఎంత నైపుణ్యం సంపాదించారన్నది తాజాగా పోస్ట్ చేసిన వీడియోను చూస్తే అర్థమవుతుంది. బాగా ఆరితేరిన చెఫ్ తరహాలో చిరు తన నైపుణ్యాన్ని చూపించారు. ఒక చోటైతే దోసెను పెనం పై నుంచి ఎగరేసిన తీరైతే వారెవా అనిపించకమానదు.
ఈ దోసె తయారీ, ఆ తర్వాత ప్రేమగా తన తల్లికి వడ్డించిన వైనం వీడియోకు ఇంకా ప్రత్యేకత తీసుకొచ్చాయి. ‘బి ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో భాగంగా పోస్ట్ అయిన వీడియోలన్నీ చూస్తే.. చిరుదే ‘ది బెస్ట్’ అనడంలో మరో మాటలేదు. సినిమాల్లోనే కాదు.. ఇక్కడా తాను నంబర్ వన్‌నే అని చిరు చాటిచెప్పారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on April 23, 2020 10:49 am
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…