మహేష్ దర్శకులు బన్నీతో !

కొందరు దర్శకులు ఒక హీరోతో ట్రావెల్ అవుతూ మరో హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నాం. తాజాగా మహేష్ బాబుతో సినిమా చేయాలనుకునే దర్శకులు మాత్రం బన్నీ వైపే చూస్తున్నారు. దీనికి ఉదాహరణ సుకుమార్ , సందీప్ రెడ్డి వంగా. సుకుమార్ ‘పుష్ప’ కంటే ముందు మహేష్ తో ప్రాజెక్ట్ అనుకున్నాడు. మైత్రిలో ఈ కాంబో సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కట్ చేస్తే క్రియేటివ్ డిఫరెన్స్ తో సినిమా క్యాన్సిల్ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.

ఆ వెంటనే సుకుమార్ బన్నీ కి పుష్ప కథ చెప్పి కొద్ది రోజుల్లోనే అల్లు అర్జున్ తో నెక్స్ట్ సినిమా అంటూ ప్రకటించేశాడు. అసలు మహేష్ కి సుక్కు చెప్పింది పుష్ప కథేనా ? ఇప్పటికీ దీనికి సరైన ఆన్సర్ లేదు. సుక్కు మాత్రం మహేష్ కోసం ఇంకో కథ చేశానని చెప్పుకున్నాడు. అయితే తాజాగా సందీప్ రెడ్డి విషయంలోనూ అదే జరిగింది. ఇక్కడ ఎనౌన్స్ మెంట్ , క్యాన్సిల్ లాంటివి లేవు కానీ మహేష్ తో సందీప్ ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ తర్వాత నుండి ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. మహేష్ ఫ్యాన్స్ మొన్నటి వరకు సూపర్ స్టార్ లైనప్ లో సందీప్ పేరు చెప్పుకుంటూనే ఉన్నారు.

కానీ ఇప్పుడు మహేష్ తో సినిమా కాకుండా అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి వంగా సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. సందీప్ రెడ్డి మహేష్ కి కొన్ని స్టోరీస్ చెప్పాడు. అల్మోస్ట్ ఈ కాంబో ఎనౌన్స్ మెంట్ వరకూ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. సందీప్ బాలీవుడ్ బిజీ అవ్వడం కూడా ఓ కరణం కావచ్చు. ఇక త్రివిక్రమ్ తర్వాత రాజమౌళితో మహేష్ సినిమా సెట్ అవ్వడంతో సందీప్ బన్నీ దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. ఏదేమైనా మహేష్ తో సినిమా అనుకొని బన్నీ దగ్గరికి చేరుకుంటున్నారు దర్శకులు.