మంచు మనోజ్.. కర్నూలు జిల్లా పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనికారెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం కొన్ని నెలల కిందటే బయటికి వచ్చింది. ఐతే సడెన్‌గా నిన్న పెళ్లి కబురును బయటపెట్టి తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు మనోజ్. నిన్న రాత్రే పెళ్లి జరిగింది. కాసేపటికే పెళ్లి ఫొటోలు బయటికి వచ్చాయి.
ఐతే ఆ ఫొటోల్లో మంచు ఫ్యామిలీ నుంచి కేవలం మనోజ్ అక్క లక్ష్మీప్రసన్న మాత్రమే కనిపించింది. ఎక్కడా మనోజ్ తల్లిదండ్రులు మోహన్ బాబు, నిర్మల కనిపించలేదు. అంతే కాక మనోజ్ అన్న మంచు విష్ణు, ఆయన సతీమణి.. ఇతర కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో జనాలకు రకరకాల సందేహాలు కలిగాయి. ఈ పెళ్లి విషయంలో మోహన్ బాబు అసంతృప్తితో ఉన్నారని.. ఆయనకు పెళ్లి ఇష్టం లేదని.. అందుకే వివాహ వేడుకకు రాలేదని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి.
ఐతే మరుసటి రోజు ఉదయానికల్లా ఈ ప్రచారానికి తెరపడిపోయింది. ముందు రిలీజ్ చేసిన ఫొటోల్లో కనిపించని మోహన్ బాబు.. తర్వాతి రోజు బయటికి వచ్చిన ఫొటోల్లో కనిపించారు. తన సతీమణి నిర్మలతో కలిసి ఆయన వివాహ వేదిక ఎక్కారు. కొత్త జంటను ఆశీర్వదించారు. మోహన్ బాబును పట్టుకుని మౌనిక ఉద్వేగానికి గురవుతున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ వేడుకకు మంచు విష్ణు భార్యా పిల్లలతో కలిసి హాజరైన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు కనిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates