ఒక సినిమాలో హీరో పలు అవతారాల్లో కనిపించడం ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపిస్తుంటుంది. సీనియర్ హీరోల్లో కమల్ హాసన్‌కు ఈ రకమైన మోజు కొంచెం ఎక్కువే. ‘దశావతారం’ సహా పలు చిత్రాల్లో ఆయన రకరకాల అవతారాల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు.
ఆయన తర్వాత విక్రమ్ కూడా ఈ తరహా సినిమాలు చేశాడు. ‘అపరిచితుడు’ మొదలుకుని..గత ఏడాది వచ్చిన ‘కోబ్రా’ వరకు విక్రమ్ పలు చిత్రాల్లో ఈ వేషాలు మార్చే పాత్రలు చేశాడు. కానీ ఒకప్పుడు ఈ తరహా పాత్రలు.. సినిమాలకు మంచి ఆదరణ ఉండేది కానీ.. తర్వాత తర్వాత మొహం మొత్తేయడంతో ప్రేక్షకుల నుంచి తిరస్కారం తప్పలేదు. గత ఏడాది ‘కోబ్రా’ చిత్రానికి వచ్చిన రిజల్ట్ చూశాక మళ్లీ ఇంకో హీరో ఇలాంటి సాహసం చేయడానికి ఆలోచిస్తాడనడంలో సందేహం లేదు. అయినా సరే.. సూర్య రిస్క్‌కు రెడీ అయినట్లు సమయాచారం.
సూర్య ప్రస్తుతం.. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అజిత్‌తో వరుసగా నాలుగు చిత్రాలు (వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం) తీసిన శివ.. ఆ తర్వాత రజినీకాంత్‌తో ‘అన్నాత్తె’ చేశాడు. అది సరిగా ఆడకపోయినా సూర్య శివను నమ్మి ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో సూర్య యోధుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి. కాగా ఇందులో అతను ఏకంగా పది రకాల గెటప్పుల్లో కనిపిస్తాడట. ఒక పీరియాడిక్ మూవీలో ఒక హీరో ఇన్ని అవతారాల్లో కనిపించడం ఇప్పటిదాకా జరగలేదు. మరి సూర్య, శివ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో చూడొచ్చంటున్నారు. మన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధ:లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
This post was last modified on March 4, 2023 9:31 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…