ధమ్కీ సంగతి ఏంటి దాసూ

ఇప్పుడున్న హీరోల్లో మార్కెట్ పరంగా ప్రామిసింగ్ గా అనిపించే క్యాటగిరీలో విశ్వక్ సేన్ ఉన్నాడు. మరీ ఎక్కువ బడ్జెట్ పెడితే రికవర్ చేయడం కష్టం కానీ ఉన్నంతలో డీసెంట్ గా ఖర్చు జరిగితే ఈజీగానే లాభాలు వస్తాయి. ఇతని కొత్త సినిమా దాస్ కి ధమ్కీ విడుదలకు రెడీ అవుతోంది. ముందు ఫిబ్రవరిలో అనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. కట్ చేస్తే మార్చి వచ్చేసింది. 21 డిసైడ్ అయ్యారనే మాట వినిపిస్తోంది కానీ ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. ప్రమోషన్లు గట్రా ఇంకా మొదలుపెట్టలేదు. అదే రోజు చెప్పుకోదగ్గ పోటీ అయితే లేదు.

కార్తికేయ బెదురులంక మాత్రమే రేస్ లో ఉంది. ఇదేమీ భయపడే కాంపిటీషన్ కాదు. మరి ధమ్కీ ఎందుకు ఫిక్స్ కావడం లేదనేది అభిమానుల ప్రశ్న. దీనికి విశ్వక్ స్వయంగా దర్శకత్వం వహించాడు. ముందు పాగల్ డైరెక్టర్ నరేష్ కుప్పిలిని తీసుకుని ఆ తర్వాత హీరోనే బాధ్యతలు తీసుకున్నాడు. ఫలక్ నుమా దాస్ అనుభవం ఎలాగూ ఉంది కాబట్టి అదేమీ ఇబ్బంది కాదు. బెజవాడ ప్రసన్న కుమార్ దీనికి రచన చేసిన సంగతి తెలిసిందే. అయితే ధమాకాకు దీనికి కొన్ని పోలికలు ఉన్నాయని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో ఆ ఛాయలు కనిపించాయి.

కానీ టీమ్ మాత్రం రెండు వేర్వేరు కథలని చెబుతోంది. సరే అది రిలీజయ్యాక తేలుతుంది కానీ ఒకవేళ మార్చి 21 లాక్ చేసుకుంటే మాత్రం హైప్ పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఓరి దేవుడాలో వెంకటేష్ లాంటి అగ్ర హీరో క్యామియో చేసినా ఫలితం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. మార్కెట్ పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న విశ్వక్ సేన్ కు ఆ మధ్య యాక్షన్ కింగ్ అర్జున్ చేసిన కామెంట్లు కొంత డ్యామేజ్ చేసినప్పటికీ అదంతా జనాలు మర్చిపోయారు. మాస్ కటౌట్ తో ధమ్కీని తీసిన ఈ కుర్రహీరో ఒకవేళ వారం గ్యాప్ లోనే వచ్చేస్తున్న నాని దసరా గురించి ఆలోచిస్తున్నాడేమో.