థియేటర్ సినిమా సగటు మధ్య తరగతి ప్రేక్షకులకు చేరువ కావాలంటే టికెట్ రేట్లే కీలకం. ఎందుకంటే మహారాజా పోషకులు వాళ్ళే. కోట్లలో బిజినెస్ లు, లక్షల్లో జీతాలు అందుకునే ఉద్యోగాలు చేసే వాళ్లకు వీక్ డేస్ లో హాళ్లకు వచ్చేంత తీరిక ఓపిక ఉండదు. కానీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని ముఖ్యంగా మల్టీప్లెక్సులు 150 నుంచి 200 రూపాయలకు పైగా రేట్లు పెట్టేయడంతో అధిక శాతం ఫ్యామిలీస్ తెరమీద ఏవి చూడాలో ఆచితూచి నిర్ణయించుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కేవలం 112 రూపాయల స్ట్రాటజీ అనేది చాలా మంచి ఆలోచన.
హైదరాబాద్ లో చాలా మల్టీప్లెక్సులు ఈ విధానాన్ని నిర్మాతల సహకారంతో రెగ్యులర్ గా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నాయి. రేపు విడుదల కాబోతున్న బలగం పివిఆర్, ఐనాక్స్ ఇలా దేంట్లో చూడాలనుకున్నా జస్ట్ 112 ఖర్చు పెడితే చాలు. ఇదొక్కటే కాదు పాత బ్లాక్ బస్టర్స్ కి సైతం ఇదే విధానాన్ని అవలంబించబోతున్నాయి. ప్రస్తుతం నగరంలో ప్రదర్శిస్తున్న వాటిలో శ్రీదేవి చాందిని, షారుఖ్ ఖాన్ చక్ దే ఇండియా, ఇంగ్లీష్ వింగ్లిష్, సమంతా ఓ బేబీ, అలియా భట్ రాజీ, గంగూబాయ్ కటియావాడి, కీర్తి సురేష్ మహానటి, దిల్వాలే దుల్హనియా లేజాయేంగే తదితర చిత్రాలన్నీ పైన చెప్పిన ధరకే టికెట్లు అమ్ముతున్నాయి.
ఇకపై ఈ ట్రెండ్ ప్రతివారం కొనసాగాలి. వందల కోట్లతో ముడిపడిన భారీ బడ్జెట్ చిత్రాలకు ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ పెద్దగా అంచనాలు లేని లో బడ్జెట్ మూవీస్ కి ఇది ఖచ్చితంగా వరమే. టైం పాస్ కోసమో, వేసవి నుంచి సేద తీరడానికి ఏసి కోసమో సినిమాలకొచ్చే పబ్లిక్ ఇలాంటి తగ్గింపులు వల్ల ఎక్కువ ఆకర్షితులు అవుతారు. బాక్సాఫీస్ బాగా డల్ గా ఉన్న టైంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. సింగల్ స్క్రీన్లలో సైతం బాల్కనీ వంద లోపు ఉంటే ఇంకా మంచిది. బయట నిత్యావసరాల ధరలతో నరకం చూస్తున్న సగటు మనిషికి వినోదాన్నిచ్చే థియేటర్లకు ఇలాంటి ఉపశమనాలు అవసరమే.
This post was last modified on March 3, 2023 8:46 am
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…