నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సఖ్యత ఉన్నది చాలా కొద్ది కాలం మాత్రమే. కెరీర్ ఆరంభ దశలో తారక్‌ను బాలయ్య పెద్దగా పట్టించుకున్నది లేదు. అతను స్టార్ అయ్యాక కాస్త గుర్తించడం మొదలుపెట్టాడు. 2009 ఎన్నికలకు ముందు కొంత కాలం ఇద్దరూ చాలా సన్నిహితంగా కనిపించేవారు. తారక్ గురించి బాలయ్య అప్పట్లో పాజిటివ్‌గా మాట్లాడేవాడు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కొంత కాలానికే పార్టీకి.. అలాగే బాలయ్యకు, చంద్రబాబుకు తారక్ దూరం అయిపోయాడు.
ఇందుకు కారణాలేంటన్నది పక్కన పెడితే.. బహిరంగంగా బాలయ్య విషయంలో తారక్ ఎప్పుడూ అమర్యాదకరంగా, అగౌరవపరిచే విధంగా మాట్లాడింది, ప్రవర్తించింది లేదు. కానీ తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. బాలయ్య మాత్రం తారక్ పట్ల వ్యవహరిస్తున్న తీరు జూనియర్ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.
తారక్ రాజకీయ ప్రవేశం గురించి మీడియా వాళ్లు అడిగినపుడల్లా బాలయ్య అతణ్ని తక్కువ చేసేలా మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. తాజాగా తారకరత్న దశ దిన కార్యక్రమం సందర్భంగా తారక్ పట్ల బాలయ్య వ్యవహరించిన తీరు మరోసారి జూనియర్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఒక ఆడిటోరియంలో బాలయ్య తనకు ఎదురు పడ్డ వాళ్లను పలకరిస్తుండగా.. కాస్త సమీపంలో ఉన్న తారక్, కళ్యాణ్ రామ్ లేచి నిలబడ్డారు. ఐతే బాలయ్య మాత్రం తారక్ వైపు చూడటం కానీ.. అతణ్ని పలకరించడం కానీ చేయలేదు. దగ్గర్లో ఉన్న వేరే వాళ్లను పలకరించి.. తారక్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిన్న వీడియో చూసి ఒక అంచనాకు రాలేం. ఆ తర్వాత తారక్‌ను బాలయ్య పలకరించాడేమో తెలియదు. కానీ వీడియో చూస్తే మాత్రం తారక్ పట్ల బాలయ్య వ్యవహరించిన తీరు ఏమాత్రం సహేతుకంగా అనిపించడం లేదు. తారక్ ఏం తప్పు చేశాడని బాలయ్య అతణ్ని ఇంత చిన్న చూపు చూస్తాడంటూ అతడి అభిమానులు మండిపడుతున్నారు సామాజిక మాధ్యమాల్లో.
This post was last modified on March 3, 2023 8:26 am
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…