టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగిన వాళ్లు ఎవ్వరూ లేరు చాలా ఏళ్లుగా. అటు ఇటుగా ఒక దశాబ్దం పాటు అనుష్క, కాజల్, సమంత, తాప్సి.. ఒకరికి ఒకరు దీటుగా నిలిచారు. ఆ తర్వాత వీరిలో ఒకరి తర్వాత ఒకరు జోరు తగ్గించేశారు. ఆ తర్వాత కొంత కాలం రకుల్ ప్రీత్, ఆపై పూజా హెగ్డే.. ఆమెతో పాటు రష్మిక మందన్నా భారీ చిత్రాలతో నంబర్ వన్ రేసులో నిలిచారు కానీ.. వీరిలో ఎవ్వరూ కూడా దీర్ఘ కాలం పాటు ఆధిపత్యం చలాయించలేదు.
రష్మికకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. పూజా హెగ్డే సైతం ఈ మధ్య జోరు తగ్గించేసింది. ఐతే ఇప్పుడు శ్రీ లీల అనే అమ్మాయి నంబర్ వన్ కిరీటం వైపు వేగంగా దూసుకెళ్తోంది. పూజా, రష్మికల జోరు తగ్గించిన సమయంలోనే ఆమె దూకుడు చూపిస్తోంది. ‘పెళ్ళిసంద-డి’ అనే పేలవమైన సినిమాతో కథానాయికగా పరిచయం అయినప్పటికీ.. ఆ చిత్రంలో శ్రీలీల బాగానే హైలైట్ అయింది.
ఆ ఊపులో ‘ధమాకా’ సినిమాలో రవితేజతో జోడీ కట్టే అవకాశం దక్కించుకున్న ఆమె.. ఈ ఛాన్సును గొప్పగా ఉపయోగించుకుంది. తన అందం, డ్యాన్సులతో అదరగొట్టేసి సినిమా బ్లాక్ బస్టర్ కావడంలో కీలక పాత్ర పోషించింది. ఈ దెబ్బతో ఒక్కసారిగా శ్రీలీల రేంజ్ మారిపోయింది.
ఓవైపు మహేష్ బాబుకు.. మరోవైపు విజయ్ దేవరకొండకు జోడీగా నటించే అవకాశాలు తెచ్చుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్ అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే శ్రీలీల టాప్ లీగ్‌కు వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. ఆమె పారితోషకం కూడా ఒక్కసారిగా రూ.1.5 కోట్లకు పెరిగిపోయిందని అంటున్నారు. ఇంకా ఆమె కోసం చాలామంది ప్రొడ్యూసర్లు ట్రై చేస్తున్నారు. ఇంకా ఒకట్రెండు హిట్లు పడ్డాయంటే మిగతా స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి శ్రీలీల హోల్ అండ్ సోల్ నంబర్ వన్ కావడం లాంఛనమే కావచ్చు.
This post was last modified on March 2, 2023 10:07 pm
మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వస్తున్నారు. నియోజక వర్గంలో చేపడుతున్న పనులు కావొచ్చు..…
మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్…
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…