కుర్ర హీరో కిరణ్ అబ్బవరం మళ్ళీ వేగం పెంచాడు. ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథతో గత సినిమాల కంటే మెరుగైన ఫలితం అందుకున్న ఆనందం ఇంకా ఉండగానే కొత్త చిత్రం మీటర్ రిలీజ్ డేట్ ఇచ్చేశాడు. ఏప్రిల్ 7న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటన వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ ఇందులో నిర్మాణ భాగస్వామి కావడం వల్ల ప్లానింగ్ గట్రా గ్రాండ్ గా ఉండబోతోంది. రమేష్ కడూరి దర్శకత్వం వహించిన మీటర్ లో కిరణ్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. గెటప్ గట్రా పవర్ ఫుల్ గానే ఉంది.
ఇదంతా బాగానే ఉంది కానీ అదే రోజు ఆల్రెడీ రవితేజ రావణాసుర డేట్ ని లాక్ చేసుకుంది. అసలే మాస్ మహారాజా మంచి ఊపుమీదున్నాడు. ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్స్ తర్వాత హ్యాట్రిక్ ఖాయమనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. దీంతో నేరుగా తలపడటం అంటే విశేషమే. అయితే ఆ పై వారం 14న సమంతా శాకుంతలం, లారెన్స్ రుద్రుడు, విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 ఉన్నాయి కాబట్టి దానికన్నా 7న రావడమే సేఫ్ గేమ్ అవుతుంది. ఈ లెక్కన కనీసం రెండు నెలలు గ్యాప్ తీసుకోకుండా కిరణ్ అబ్బవరం కొత్త రిలీజ్ వచ్చేసినట్టు
మొత్తానికి రిస్క్ చూసుకోకుండా కంటెంట్ మీద నమ్మకంతో బరిలో దిగినట్టు కనిపిస్తోంది. ఎస్ఆర్ కళ్యాణ మండపం రేంజ్ హిట్టు కోసం కిరణ్ ఎదురు చూపులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ స్థాయిలో మరో విజయం ఇంకా దక్కలేదు. వేగంగా సినిమాలు చేయడం గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నా తగ్గదేలే అంటున్నాడీ యూత్ హీరో. పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్లకే ఖాకీ యునిఫార్మ్ బాగా సెట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కిరణ్ అబ్బవరం ఇంత బరువును ఎలా మోస్తాడో స్క్రీన్ మీద చూస్తే కానీ చెప్పలేం. నెక్స్ట్ వరసలో రూల్స్ రంజన్ విడుదలకు ముస్తాబవుతోంది
This post was last modified on March 1, 2023 5:53 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…