తెలుగు, ఇతర భాషల ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోయినా.. గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్టయిన చిత్రాల్లో ‘పొన్నియన్ సెల్వన్’ ఒకటి. తమిళంలో ఆల్ టైం బెస్ట్ నవలగా పేరున్న ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట సంచలన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా తమిళవాళ్లు ఉన్న ప్రతి చోటా ఈ చిత్రం అదరగొట్టింది.
తమిళులు ఈ చిత్రాన్ని గర్వకారణంగా భావించారు. ఈ సినిమా చూడడాన్ని ఒక బాధ్యతగా ఫీలయ్యారు. దీంతో సినిమాపై వసూళ్ల వర్షం కురిసింది. పొన్నియన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ టైంకే రెండో పార్ట్ కూడా చాలా వరకు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 28న ‘పీఎస్-2’ను రిలీజ్ చేయబోతున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. కానీ ఈ మధ్య అనుకున్న ప్రకారం ఈ సినిమా రావడం సందేహమే అని ప్రచారం మొదలైంది. ఈ ఏడాది ద్వితీయార్ధానికి వాయిదా అన్నారు.
కానీ ఆ ప్రచారం నిజం కాదని తేలిపోయింది. అనుకున్న ప్రకారమే సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ధ్రువీకరించింది. ఈ మేరకు కొత్త పోస్టర్ కూడా వదిలింది. దీంతో తమిళ జనాల సంబరం మామూలుగా లేదు. మనకు అంత ఎగ్జైట్మెంట్ లేకపోయినా.. తమిళ జనాలు మాత్రం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి భాగం చూసిన ప్రతి ఒక్కరూ దీన్నీ చూస్తారనడంలో సందేహం లేదు.
థియేటర్లలో మిస్సయి ఓటీటీలో చూసిన వాళ్లు కూడా ముగింపు భాగాన్ని తెరపై చూడడానికి రెడీ అయ్యారు. టాక్‌తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తుందనడంలో సందేహం లేదు. తెలుగులో అఖిల్ సినిమా ‘ఏజెంట్’కు పోటీగా ‘పొన్నియన్ సెల్వన్-2’ రిలీజ్ కాబోతోంది. హిందీలో కూడా ఈ సినిమా గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. మరి సెకండ్ పార్ట్ అయినా తమిళేతర భాషల్లో మంచి ఫలితం అందుకుంటుందేమో చూడాలి.
This post was last modified on March 1, 2023 10:18 pm
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…