ది ఘోస్ట్ తర్వాత నాగార్జున కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఈ బ్రేక్ లో రైటర్ ప్రసన్న తో ఒక సినిమా అలాగే మోహన్ రాజా చేయబోతున్న 100 సినిమాను సెట్ చేసుకున్నాడు. అయితే మోహన్ రాజా సినిమాకు ఇంకా టైమ్ తీసుకొనున్నాడు నాగ్. ఆ సినిమాలో అఖిల్ తో కూడా ఓ కేరెక్టర్ చేయించాలని మోహన్ రాజా భావిస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ లోపు ప్రసన్న కుమార్ సినిమాను కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు నాగార్జున.
ప్రసన్న కుమార్ బెజవాడను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్ సినిమా చేస్తున్నారని ఎప్పుడో బయటికొచ్చేసింది. ఈ సినిమాలో కాస్టింగ్ డీటైల్స్ కూడా లీక్ అయ్యాయి. ఇదొక రీమేక్ అన్న సంగతి కూడా మేకర్స్ మెల్లగా లీక్ చేసేశారు. అయితే ఇంత వరకూ ఈ సినిమాను ఎనౌన్స్ చేయకుండా ఇంకా అక్కినేని ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తున్నారు.
నిజానికి ప్రసన్న ఈ సినిమాకు సంబందించి కొంత ఘాట్ కూడా చేసేశారు. పల్లెటూరి నేపథ్యంలో కామెడీ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించి సంక్రాంతి టైమ్ లో అమలాపురంలో కొన్ని మంటేజ్ షాట్స్ తీశారు. అక్కడ జరిగే ప్రభల తీర్థంను సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
సంక్రాంతి తర్వాత సినిమా ఎనౌన్స్ మెంట్ అనుకున్నారు కానీ మెల్లగా వాయిదా వేస్తూ వస్తున్నారు. మార్చ్ లో ఉగాదికి ఈ సినిమా ఓపెనింగ్ జరగనుందని టాక్ ఉంది. ఎనౌన్స్ మెంట్ లేకుండా డైరెక్ట్ గా ఓపెనింగ్ పెట్టేసుకొని గ్రాండ్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు మానస వారణాసి ను ఒక హీరోయిన్ గా ఫైనల్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇందులో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ స్పెషల్ కేరెక్టర్స్ చేయబోతున్నారు. అల్లరి నరేష్ పాత్ర కాస్త నిడివి ఎక్కువ ఉండనుందని సమాచారం.
This post was last modified on February 28, 2023 11:18 pm
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే విజయం దక్కించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…