Movie News

శాకుంతలంను కవ్విస్తున్న డబ్బింగ్ సినిమాలు

అసలే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన శాకుంతలం ఎట్టకేలకు ఏప్రిల్ 14 విడుదలను లాక్ చేసుకుని రెండు వారాల క్రితమే ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు గుణశేఖర్ తో పాటు నిర్మాణ భాగస్వామిగా ఉన్న నిర్మాత దిల్ రాజు పోటీ తదితర అంశాలు అన్నీ నిశితంగా పరిశీలించే ఆ డేట్ ని లాక్ చేసుకున్నారు. ఎలాగూ ఆ నెల చివర్లో పొన్నియన్ సెల్వన్ 2 వస్తుంది కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకుంటే రెండు వారాల్లో ప్రాజెక్టు సేఫ్ అయిపోతుంది. మణిశర్మ పాటలు మెల్లగా మ్యూజిక్ లవర్స్ కి ఎక్కేస్తున్నాయి. ట్రైలర్ అంచనాలు పెంచేలానే వచ్చింది.

ఎంత ప్లాన్డ్ గా చేసుకున్నా సమంతా సినిమాకు కాంపిటీషన్ సెగలు తప్పడం లేదు. లారెన్స్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన రుద్రుడు అదే డేట్ కి వస్తోంది. ఇది కూడా భారీ బడ్జెట్ తో రూపొందిందే. ఊర మాస్ దెయ్యం కథలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే లారెన్స్ ఈసారి మళ్ళీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. తెలుగు మార్కెట్ లోనూ తనకు మంచి పట్టుకుంది. ఎంత విమర్శలు వచ్చినా కాంచన 3 డబ్బింగ్ వెర్షన్ బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చింది. తమిళంలో గ్రాండ్ రిలీజ్ ఇస్తారు కాబట్టి శాకుంతలంకు అరవ రాష్ట్రంలో స్క్రీన్ కౌంట్ పరంగా చిక్కులొస్తాయి.

ఇక్కడితో అయిపోలేదు. విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 సైతం ఏప్రిల్ పధ్నాలుగే కావాలని నిన్నే అఫీషియల్ గా ప్రకటన ఇచ్చింది. చాలా ఏళ్లుగా హిట్ లేకుండా మొహం వాచిపోయిన ఈ హీరో మీద ఇక్కడ పెద్దగా అంచనాలేం లేవు కానీ ఆ టైంకంతా హైప్ ఎలా ఉంటుందో చెప్పలేం. తక్కువ అంచనా వేయడానికి లేదు. నిఖిల్ స్పైని కూడా ఆ సమయానికే అనుకున్నారు కానీ ఇప్పుడీ ట్రయాంగిల్ వార్ చూసి వెనక్కు తగ్గక తప్పదు. శాకుంతలం వీటితో తలపడి గెలవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. వారం ముందు రవితేజ రావణాసుర ఆల్రెడీ కర్చీఫ్ వేసేసి రెడీగా ఉన్నాడు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

12 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago