అక్షయ్ కుమార్.. ఈ పేరు వింటే దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఒక భరోసా ఉండేది ఒకప్పుడు. తనతో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే నమ్మకంతో ఉండేవాళ్లు అందరూ ఒకప్పుడు. మిగతా స్టార్ హీరోల మాదిరి కథల ఎంపికలో, సినిమాలు చేయడంలో అక్షయ్ నాన్చేవాడు కాదు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే రెండు మూడు కథలు ఓకే చేసేవాడు. సినిమా మొదలుపెడితే రెండు మూడు నెలల్లో అవగొట్టేసేవాడు.
ఏడాదికి మూణ్నాలుగు రిలీజ్‌లు ఉండేలా చూసుకునేవాడు. కానీ అలా గ్యాప్ లేకుండా, తక్కువ టైంలో సినిమాలు చేస్తూ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసేవాడు. వేరే హీరోలు ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుని చేసే సినిమాల కంటే అక్షయ్ కొన్ని నెలల్లో పూర్తి చేసే సినిమాలే మెరుగ్గా ఉండేవి. అతడి సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ ఉండేవి. తక్కువ బడ్జెట్లో సినిమాలు చేయడం వల్ల టాక్ తేడా కొట్టినా సేఫ్ జోన్లో ఉండేవి. టాక్ బాగుంటే బ్లాక్ బస్టర్ అయ్యేవి.
రౌడీ రాథోడ్, ఓఎంజీ, స్పెషల్ చబ్బీస్, వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబయి, బేబీ, ఎయిర్ లిఫ్ట్, రుస్తుం, హౌస్ ఫుల్-3, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్‌కథ.. ఇలా కొన్నేళ్ల ముందు ఇబ్బడి ముబ్బడిగా హిట్లు కొట్టాడు అక్షయ్. బాలీవుడ్లో టాప్ స్టార్లయిన ఖాన్‌లను మించి అతను వార్షికాదాయం అందుకున్నాడు ఒక టైంలో. వాళ్లు ఒక్కో సినిమాకు ఎక్కువ పారితోషకం తీసుకున్నా.. అక్షయ్ ఏడాదిలో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల వారిని మించి ఆర్జిస్తూ పైకి వెళ్లిపోయాడు. ఇలా వైభవం చూసిన హీరో.. ఇప్పుడు దయనీయమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.
కరోనా తర్వాత అతడి సినిమాలు దారుణాతి దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. ఒక్క సూర్యవంశీ మాత్రమే బాగా ఆడింది. ఆ తర్వాత వచ్చిన బచ్చన్ పాండే, పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఓటీటీలో రిలీజైన కట్ పుట్లి సైతం నిరాశ పరిచింది. తాజాగా అక్షయ్ నుంచి వచ్చిన ‘సెల్ఫీ’ సినిమా అతడి కెరీర్‌ను పాతాళంలోకి తీసుకెళ్లిపోయింది. తన మార్కెట్‌ను దారుణంగా దెబ్బ తీసింది. ఈ ప్రభావం అక్షయ్ తర్వాతి సినిమాల మీద కూడా పడేలా ఉంది. వాటిని కొనడానికి బయ్యర్లు భయపడేలా ఉంది. బిజినెస్ జరగడం కష్టమయ్యేలా ఉంది. కొన్నేళ్ల ముందు వరకు బాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్న అక్షయ్ చూస్తుండగానే ఇలా పతనం అయిపోవడం అనూహ్యం.
This post was last modified on February 28, 2023 4:06 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…