Movie News

ప్రీమియర్ షోలు.. పబ్లిసిటీ అస్త్రాలు

ఒక సినిమాను రిలీజ్ కంటే ముందే ప్రేక్షకులకి ప్రీమియర్ షోల ద్వారా చూపించడానికి దర్శక నిర్మాతలకు ఎంతో దైర్యం ఉండాలి. ఆ రిస్క్ చేసి నిర్మాత ముందడుగు వేస్తే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉందనుకోవచ్చు. అయితే అన్ని సార్లు అలాంటి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేయలేం కూడా. ముందు ప్రీమియర్స్ వేసి బోల్తా కొట్టిన సినిమాలు కూడా ఉదాహరణగా కనిపిస్తున్నాయి.

ప్రీమియర్ షోస్ మనకి కొత్తేం కాదు. ఇది వరకూ చాలానే సినిమాలు ఇలా ముందే ప్రదర్శించారు. కానీ ప్రస్తుతం ప్రీమియర్ షోలు పబ్లిసిటీకి ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. ఈ మధ్య ఈ ప్రీమియర్ షోస్ ట్రెండ్ ను మళ్ళీ స్టార్ట్ చేసి దాన్ని తన పబ్లిసిటీ స్టంట్ గా వాడుకున్నాడు అడివి శేష్ . రిలీజ్ వారం ముందే కొన్ని ప్లేస్ లు సెలెక్ట్ చేసి ముందే షోస్ వేయడంతో మేజర్ కి మంచి బజ్ వచ్చింది. దీంతో సినిమా మంచి ఓపెనింగ్స్ అందుకుంది.

ఇటీవలే రైటర్ పద్మభూషణ్ అనే చిన్న సినిమాకు కూడా ఇలానే కొన్ని ఏరియాలు సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్ గా ప్రీమియర్ షోస్ వేశారు. దీన్ని తీసింది కూడా మేజర్ నిర్మాతలే. కాబట్టి ఆ పబ్లిసిటీ స్టంట్ ఇక్కడ కూడా పనైంది. ఇదే కోవలో లేటెస్ట్ గా సార్ కి కూడా ప్రీమియర్స్ పడ్డాయి. ముందు రోజు అప్పటి కప్పుడు తీసుకున్న నిర్ణయం సినిమా రిజల్ట్ కి పనికొచ్చింది. ఆ ప్రీమియర్ షోస్ ‘సార్’ కి మంచి ఓపెనింగ్స్ తీసుకురావడమే కాకుండా సక్సెస్ కూడా అందించాయి.

ఇప్పుడు దిల్ రాజు కూడా తన కొత్త బేనర్ నుండి వస్తున్న ‘బలగం’ అనే చిన్న సినిమాకు ప్రీమియర్ షో అనే అస్త్రాన్ని వాడుకుంటున్నాడు. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ వేశారు. రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఈ చిన్న సినిమాకి కూడా ప్రీమియర్స్ అస్త్రం వర్కవుటై, ఓపెనింగ్స్ తీసుకొస్తే వీటన్నిటినీ చూసి ఇకపై అందరూ ఇదే ఫాలో అవ్వడం ఖాయం.

This post was last modified on February 28, 2023 10:15 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago