యాభై సినిమాల మైలురాయికి చేరువలో ఉన్న నిర్మాత దిల్ రాజు చిన్న చిత్రాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎస్విసి కాకుండా తన పేరు మీదే కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నేటివిటీ ప్రాధాన్యంగా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో మొదలుపెట్టామని ఆ మధ్య రాజుగారు చెప్పారు. అందులో భాగంగానే బలగంని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టీమ్ విస్తృతంగా తిరుగుతూ ప్రమోషన్లు గట్రా చేస్తోంది. కొన్ని చోట్ల ప్రీమియర్లు జరిగాయి. ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది.
అదో స్వచ్ఛమైన పల్లెటూరు. ఊరందరికీ తల్లో నాలుకలా నడుచుకునే ఓ తాత. వయసు అనుభవం అన్నిటిలోనూ ఆ పెద్ద మనిషి మాటంటే అందరికీ గౌరవం. పేరెంత ఉన్నా మనవడు(ప్రియదర్శి)మాత్రం జాలీగా తిరుగుతూ ఉంటాడు. సరే పెళ్ళైతే దారిలో పడతాడేమోనని ఓ చక్కని పిల్ల(కావ్య కళ్యాణ్ రామ్)తో సంబంధం ఖాయం చేస్తారు. అయితే కాబోయే అల్లుడు మీద మామకు మంచి అభిప్రాయం ఉండదు. ఈలోగా ఈ కుటుంబంలో ఓ విషాదం తలెత్తుతుంది. తాత కాలం చేస్తాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఆ యువకుడి జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయనేదే స్టోరీ.
కథను దాచకుండా స్పష్టంగా చూపించేశారు. తెలంగాణ విజువల్స్, బాష యాస అన్నీ సహజంగా ఉన్నాయి. కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వేణు ఈ బలగంతో దర్శకుడిగా మారాడు. భీమ్స్ సెసిరోలియో సంగీతం, ఆచార్య వేణు ఛాయాగ్రహణం లాంటి మంచి టీమ్ నే సెట్ చేసుకున్నారు. కమర్షియల్ సినిమాలకు గ్రాండియర్లకు ఆదరణ ఎక్కువగా దక్కుతున్న ట్రెండ్ లో అసలు ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేకుండా కేవలం కంటెంట్ ని నమ్ముకుని బలగం బృందం థియేటర్లలో అడుగు పెడుతోంది. మార్చి 3న పెద్దగా పోటీ లేకపోవడంతో మంచి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు.
This post was last modified on February 27, 2023 10:42 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…