ఇండియాలో ఎక్కువ వారాల పాటు సినిమాలు బాగా ఆడే సీజన్ అంటే వేసవే. మార్చి నెలాఖరుతో మొదలుపెడితే రెండు నెలల పాటు ఎక్కువగా విద్యార్థులకు సెలవులుంటాయి కాబట్టి.. థియేటర్లకు పెద్ద ఎత్తున జనం వస్తారు. ఆ టైంలో సిినమాలకు మంచి వసూళ్లు వస్తుంటాయి. అందుకే పెద్ద సినిమాల్ని వేసవిలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో రెండు మూడు అయినా పెద్ద సినిమాలకు కచ్చితంగా రిలీజవుతుంటాయి.
గత ఏడాది ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట, కేజీఎఫ్, ఆచార్య లాంటి పెద్ద సినిమాలు వేసవిలో రిలీజయ్యాయి. కానీ ఈసారి మాత్రం టాప్ స్టార్ల సినిమాలు ఏవీ వేసవిలో రావట్లేదు. సమ్మర్‌కే అనుకున్న సలార్, హరిహర వీరమల్లు, భోళా శంకర్, మహేష్-త్రివిక్రమ్ సినిమా రకరకాల కారణాల వాయిదా పడిపోయాయి. దీంతో మిడ్ రేంజ్ హీరోల సినిమాలతోనే సరిపెట్టుకోక తప్పేలా లేదు.
ఐతే సమ్మర్లో వచ్చే మీడియం రేంజ్ సినిమాల్లో పెద్ద స్థాయికి వెళ్లగల సత్తా నాని సినిమా ‘దసరా’కే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏజెంట్, రావణాసుర, శాకుంతలం, రామబాణం, విరూపాక్ష లాంటి చిత్రాలకు కూడా మంచి క్రేజే కనిపిస్తోంది కానీ.. వీటన్నటింటినీ మించి నాని సినిమాకు బజ్ ఎక్కువగా ఉంది. దీని టీజర్ రిలీజయ్యాక హైప్ అమాంతం పెరిగిపోయింది. నాని కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమా అవుతుందనే ధీమా ట్రేడ్ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. ఇలాంటి సినిమాలు క్లిక్ అయితే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి.
పెద్ద స్టార్ల సినిమాలేవీ లేనపుడు అందుబాటులో ఉన్న సినిమాల్లో ఏది నచ్చితే దాన్ని పెద్ద రేంజికి తీసుకెళ్తారు ప్రేక్షకులు. కాబట్టి ‘దసరా’కు పాజిటివ్ టాక్ వస్తే వేసవిలో అతి పెద్ద సక్సెస్ అయ్యే సినిమాగా నిలవడానికి ఆస్కారం లేకపోలేదు. సుకుమార్ శిష్యుడైన కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మార్చి 30న ‘దసరా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
This post was last modified on February 27, 2023 12:20 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…