శేఖర్ కమ్ములకు కలిసొచ్చిన కాలం

కొన్నిసార్లు ఆలస్యాలూ మంచే చేస్తాయి. తీసేవి భారీ బడ్జెట్ లేని సింపుల్ ఎమోషనల్ కథలే అయినా చాలా గ్యాప్ తీసుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల తన కొత్త సినిమాని ధనుష్ తో ప్రకటించి నెలలు దాటుతోంది. ఇప్పటిదాకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. ముహూర్తమో మరొకటో కారణం కాదు. ఇంకా స్క్రిప్ట్ పనులే పూర్తి కాలేదట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సీరియస్ సోషల్ ఇష్యూస్ మీద రాసుకుంటున్న శేఖర్ కమ్ముల వీలైనంత వరకు తానే రానాతో తీసిన లీడర్ పోలికలు రాకుండా జాగ్రత్త పడుతూ టైం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదట.

రాజీ పడకూడదనే ఉద్దేశం అర్థమైపోవడంతో ధనుష్ తో పాటు నిర్మాతలూ సహకరిస్తునట్టు తెలిసింది. ఇదంతా ఒకరకంగా కలిసొచ్చేలా ఉంది. ఎందుకంటే నిన్నా మొన్నటి దాకా అంతగా గొప్పగా చెప్పుకునే మార్కెట్ లేని ధనుష్ కి సార్ బ్లాక్ బస్టర్ సక్సెస్ పెద్ద కిక్ ఇచ్చింది. డబ్బింగ్ మూవీ అయితే ఏదోలే అనుకోవచ్చు. కష్టపడి తెలుగు నేర్చుకుని మరీ బైలింగ్వల్ చేశాడు. నిజానికి అంత అవసరం లేదు. తమిళ వెర్షనే తీసి అనువదించినా సరిపోయేది. కానీ ఒరిజినాలిటీ కోసం కాంప్రోమైజ్ కాకపోవడంతో దాని ఫలితం చాలా గొప్పగా వచ్చింది.

రెండో వారంలోనూ ముఖ్యంగా వీకెండ్లో హౌస్ ఫుల్స్ తో దూకుడు కొనసాగించేలా చేసింది. దెబ్బకు ధనుష్ కి టాలీవుడ్ థియేట్రికల్ మార్కెట్ బాగా బలపడింది. ఎలాగూ కమ్ముల ధనుష్ ల కాంబోని తెరకెక్కిస్తున్నది ఏషియన్ ప్లస్ అమిగోస్ సంస్థలు కాబట్టి ప్రొడక్షన్ వేల్యూస్ భారీగా ఉంటాయి. జరిగే లేట్ ఎలాగూ అయ్యింది కాబట్టి కాస్త ఓపిక పడితే బెస్ట్ అవుట్ ఫుట్ ని ఆశించవచ్చు. వరుణ్ తేజ్ ఫిదాతో బ్లాక్ బస్టర్, నాగ చైతన్యతో లవ్ స్టోరీ సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల హ్యాట్రిక్ తో దీన్ని కొనసాగించే పట్టుదలతో ఉన్నారు. సరైన హీరోతో పాటు కాలమూ కలిసొచ్చింది