క్రమంగా స్టార్ అట్రాక్షన్లు తోడవ్వడంతో వెబ్ సిరీస్ లు కూడా అంచనాలు మోసుకుంటూ రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే పులి మేక. ఫ్రమ్ ది రైటర్ అఫ్ వాల్తేరు వీరయ్యగా రచయిత కోన వెంకట్ ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ నిన్న ఓటిటిలో విడుదలయ్యింది. లావణ్య త్రిపాఠితో పాటు ఆది సాయికుమార్ కి ఇదే డిజిటల్ డెబ్యూ. సోషల్ మీడియాలో ట్వీట్లు యాడ్లు చూశాక దీని మీద ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు తలెత్తాయి. సగటున అరగంట చొప్పున మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా ఈ పులి మేక రూపొందింది. మరి ఆటలో గెలిచింది ఎవరు.
ఓ సీరియల్ కిల్లర్ వరసగా పోలీస్ ఆఫీసర్లను హత్య చేస్తూ ఉంటాడు. ఎలాంటి క్లూస్ లేక హంతకుడెవరో తెలియని పరిస్థితుల్లో కేసుని ఛేదించేందుకు ప్రత్యేక అధికారి కిరణ్ ప్రభ(లావణ్య త్రిపాఠి) రంగంలోకి దిగుతుంది. ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ హెడ్ ప్రభాకర్ (ఆది సాయికుమార్)తనకు సహాయం చేస్తూ ఉంటాడు. చిక్కుముడులు విప్పేకొద్దీ అనూహ్యమైన వాస్తవాలు బయట పడతాయి. మర్డర్లు చేసిందెవరో తెలుసుకునే క్రమంలో ప్రభను ప్రమాదాలు చుట్టుముడతాయి. పలు ట్విస్టుల తర్వాత అతన్ని పట్టుకోవడానికి ఆమె ఎలాంటి వల పన్నిందనేదే స్టోరీ.
కథపరంగా చూసుకుంటే కొంచెం ఇలాంటి లైన్ తోనే ఆ మధ్య మళయాలంలో కుంచకో బోబన్ అంజమ్ పాతిర వచ్చింది. మిడ్ నైట్ మర్డర్స్ పేరుతో డబ్ కూడా చేశారు. అయితే పులి మేక వెబ్ సిరీస్ కావడంతో లెన్త్ కోసం మెయిన్ ప్లాట్ కు సంబంధం లేని ఎమోషన్లు, లవ్ ట్రాక్ ఇరికించడంతో మొదటి నాలుగు ఎపిసోడ్లు సోసోగానే సాగుతాయి. అసలు మలుపులన్నీ ఆ తర్వాత పెట్టడంతో ఆసక్తి పెరగడం అక్కడి నుంచి మొదలవుతుంది. చక్రవర్తి రెడ్డి టేకింగ్ ఓకే అనిపించినా అసలైన స్క్రిప్ట్ విషయంలో సరైన కసరత్తు జరగలేదు. ఎంత భారంగా ఉన్న సరే టైంపాస్ కావాలంటే తప్ప పులిమేక ఛాయస్ గా నిలవదు.
This post was last modified on February 25, 2023 3:14 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…