గత ఏడాది బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ సహా లెఫ్ట్ భావజాలం ఉన్న, ‘లిబరల్స్’గా పేరున్న హీరోల సినిమాలను ఒక వర్గం అదే పనిగా టార్గెట్ చేసింది. గతంలో ఎప్పుడో మాట్లాడిన మాటల్ని.. జరిగిన సంఘటనల్ని బయటికి తీసి సినిమాలను బాయ్‌కాట్ చేయమంటూ సోషల్ మీడియాలో ఉద్యమాలు చేశారు. ‘లాల్ సింగ్ చడ్డా’ సహా కొన్ని సినిమాలు ఈ నెగెటివిటీ ధాటికి బాక్సాఫీస్ దగ్గర దారుణంగా దెబ్బ తిన్నాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేక్షకులను మెప్పించని మాట వాస్తవమే కానీ.. రిలీజ్‌కు ముందే ‘డిజాస్టర్’ అని ముందే ఫిక్సయ్యే పరిస్థితి వచ్చిందంటే.. అందుకు కొన్ని నెలల పాటు సోషల్ మీడియాలో అదే పనిగా సాగిన వ్యతిరేక ప్రచారం ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు. ఇలాంటి ప్రచారాలు మరి కొన్ని సినిమాల మీద ప్రతికూల ప్రభావం చూపాయి. ఐతే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, పరిస్థితులు తిరగబడతాయి అనడానికి ఉదాహరణలు చూస్తున్నాం.
అప్పుడేమో మోడీ సర్కారుకు వ్యతిరేకులుగా ముద్ర పడ్డ హీరోలు, నిర్మాతలు, దర్శకుల చిత్రాలను ఒక వర్గం టార్గెట్ చేసింది. కానీ ఒక దశ దాటాక వీరి వ్యవహారం శ్రుతి మించడంతో జనాలకు చిర్రెత్తుకొచ్చింది. ఈ బాయ్‌కాట్ బ్యాచ్ అదే పనిగా టార్గెట్ చేసిన ‘పఠాన్’ సినిమాకు అసాధారణ విజయాన్ని అందించారు ప్రేక్షకులు.
మరోవైపు ఈ బాయ్‌కాట్ బ్యాచ్ కొన్ని సినిమాలను టార్గెట్ చేస్తున్న సమయంలో బాగా ఎంజాయ్ చేయడమే కాక.. బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేస్తూ, మోడీ సర్కారుకు భజన చేస్తూ వచ్చిన కంగనా రనౌత్‌కు తర్వాత బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే తగిలింది. ఆమె సినిమా ‘ధకడ్’కు దారుణ పరాభవం తప్పలేదు. కంగనా చేసిన అతి పుణ్యమా అని.. ప్రేక్షకులు ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాను పక్కన పెట్టిన సంకేతాలు కనిపించాయి. కంగనా గత సినిమాలతో పోలిస్తే మినిమం ఓపెనింగ్స్ రాలేదీ చిత్రానికి. ఇక కంగనా లాగే బీజీపీ వ్యతిరేకుల దృష్టిలో పడి సినిమాలను దెబ్బ తీసుకున్న ఆర్టిస్టుల్లో అక్షయ్ కుమార్ ఒకడు. కొన్నేళ్ల నుంచి అతను బీజేపీ మద్దతుదారుగా ముద్ర వేసుకుంటున్నాడు.
మోడీ, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్లను కలవడం.. మోడీ ప్రభుత్వ, బీజీపీ ప్రాయోజిత కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేశాడు. దీంతో కంగనా లాగే అతనూ ఒక వర్గానికి టార్గెట్ అయిపోయాడు. గత ఏడాది టాక్‌తో సంబంధం లేకుండా అక్షయ్ సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఒకప్పుడు అక్షయ్ సినిమాలు తొలి రోజు అలవోకగా 20 కోట్ల వసూళ్లు రాబట్టేవి. అలాంటిది అతడి కొత్త చిత్రం ‘సెల్ఫీ’ తొలి రోజు వసూళ్లు రూ.2 కోట్లకు పడిపోయాయి. సినీ నటులు రాజకీయాల జోలికి వెళ్లకుండా, ఒక ముద్ర వేయించుకోకుండా తమ పనేదో తాము చేసుకుపోతే బెటర్ అనడానికి ఈ పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
This post was last modified on February 25, 2023 2:40 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…