ఇంకో ఇరవై రోజుల కంటే తక్కువ వ్యవధిలో జరగనున్న ఆస్కార్ సంబరానికి ముందే ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా మొదలయ్యాయి. ఈ రోజు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించిన నాలుగు విభాగాల్లో ట్రిపులార్ పురస్కారం దక్కించుకుని శబాష్ అనిపించుకుంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, యాక్షన్ సినిమా, నాటు నాటు పాట, స్టంట్స్ క్యాటగిరీలలో విపరీతమైన పోటీని తట్టుకుని మరీ విన్నర్ గా నిలిచింది. మరికొన్ని అనౌన్స్ మెంట్లు క్రమంగా జరుగుతున్న తరుణంలో నెంబర్ పెరిగే అవకాశం లేకపోలేదు. అవతార్ 2, టాప్ గన్ మావరిక్ లాంటి టాప్ కాంపిటీషన్ ఉందక్కడ
రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ తో పాటు టీమ్ లోని కీలక సభ్యులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. టాలీవుడ్ అభిమానులకు అంతగా అవగాహన లేదు కానీ ఈ హెచ్ సిఏ ఇచ్చే అవార్డులకు ఇంటర్నేషనల్ లెవెల్ లో గొప్ప ప్రామాణికత ఉంది. ఊరికినే పాపులారిటీ ఆధారంగా ఇచ్చేయరు. ఎన్నో అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే విజేతను నిర్ణయిస్తారు. అందుకే ఆస్కార్ ముంగిట జరిగే ఈ వేడుకకు అంత ప్రాధాన్యం దక్కుతుంది. తారకరత్న పెద్దకర్మ మార్చ్ 2 జరగనున్న నేపథ్యంలో అది పూర్తి చేసుకున్నాక జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయలుదేరి వెళ్లబోతున్నాడు
తెలుగువారు గర్వపడే పరిణామాలివి. జక్కన్న వీటిని ఇండియన్ ఫిలిం మేకర్స్ అందరికీ అంకితం ఇస్తున్నానని తన బృందంలో ప్రతి ఒక్కరు కష్టపడటం వల్లే ఈ స్థాయి దాకా వచ్చామని వినమ్రంగా చెప్పిన తీరు ఆహుతులను ఆకట్టుకుంది. గత పది నెలలుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషనే ప్రపంచంగా గ్లోబల్ ఆడియన్స్ ని దాన్ని చేరువ చేయడంలో రాజమౌళి పడిన కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. జపాన్ లాంటి దేశంలో ఏకంగా వంద రోజులకు పరుగులు పెడుతూ ఇప్పటికీ హౌస్ ఫుల్ పడటం దానికో ఉదాహరణ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకెన్ని అద్భుతాలు వినాలో
This post was last modified on February 25, 2023 10:13 am
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…