అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఏజెంట్ సరిగ్గా ఇంకో రెండు నెలల్లో అడుగు పెట్టబోతున్నాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంకా సినిమాని చెక్కుతూనే ఉన్నారు. బ్యాలన్స్ ఉన్న ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం విదేశాలకు వెళ్లొచ్చాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం చేయబోతున్నారు. మరోవైపు నిర్మాత అనిల్ సుంకర బిజినెస్ డీల్స్ ని ఫైనల్ చేస్తున్నారు. ట్రేడ్ టాక్ ప్రకారం ఏపీ తెలంగాణ థియేట్రికల్ హక్కులను ముప్పై అయిదు కోట్లకు అమ్మారట. కర్ణాటక నుంచి మరో నాలుగు లేదా అయిదు కోట్లు రావొచ్చు. మూడు కీలక రాష్ట్రాల నుంచి నలభై దాకా వస్తుందన్న మాట
మమ్ముట్టి ఉన్నారు కాబట్టి కేరళ నుంచి ఎంత ఆఫర్ వస్తుందనేది ఇంకా తేలలేదు. ఆయనేమి ఏజెంట్ లో హీరో కాదు కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు మరీ భారీ రేట్లకు ఎస్ అనలేరు. గతంలో జనతా గ్యారేజ్ టైంలోనూ ఎంత మోహన్ లాల్ కీలక పాత్ర పోషించినా మల్లువుడ్ బయ్యర్లు ఫ్యాన్సీ రేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏజెంట్ కీ ఇదే రిపీట్ కావొచ్చు. హిందీకి సంబంధించి ట్రైలర్ కట్ వచ్చాకే దాని వ్యవహారాలు చూస్తారట. ఎందుకంటే పఠాన్ లాంటి గ్రాండ్ స్పై డ్రామాలు చూసిన జనాలకు మన ఏజెంట్ లో అంతకు మించిన ఎక్స్ ట్రాడినరి కంటెంట్ ఉందంటేనే చూసేందుకు ఎగబడతారు.
బడ్జెట్ పరంగా సుమారు ఎనభై కోట్ల దాకా అయ్యిందని వినికిడి. శాటిలైట్, డబ్బింగ్, ఓటిటి ఇవన్నీ కలుపుకుని ఫైనల్ గా ఏజెంట్ సేఫ్ సైడ్ అవుతుందనే టాక్ అయితే ఉంది. ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా ఉన్న నిర్లిప్తతను బ్రేక్ చేయాలంటే అదిరిపోయే టీజర్ లేదా ట్రైలర్ ని వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకోవాలి. పెట్టుబడి పరంగా ఎంత లాభమొచ్చినా ఏజెంట్ థియేటర్లలో బ్లాక్ బస్టర్ కావడం అఖిల్ కు చాలా అవసరం. మూడేళ్ళ పాటు ఇది తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉన్నాడు. మరో కొత్త సినిమా మొదలుపెట్టకుండా ఆగాడు. అందుకే ఫ్యాన్స్ ఎగ్ జైట్మెంట్ ఓ రేంజ్ లో ఉంది.
This post was last modified on February 24, 2023 5:03 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…