Movie News

Big Story సీనియర్ దర్శకుల అష్టకష్టాలు

ఒకప్పుడు వరుస సూపర్ హిట్ల తో చలామణీ అయిన సీనియర్ దర్శకులు ఇప్పుడు సినిమా తీసేందుకు తీసిన సినిమా రిలీజ్ చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకప్పుడు అడ్వాన్సులతో నిర్మాతలను వారి వెంట తిప్పించుకున్న దర్శకులు ఇప్పుడు నిర్మాతల వెంట పడుతూ సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.

వీవీ వినాయక్ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ డైరెక్టర్. మాస్ కి పూనకాలు తెప్పించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న వినాయక్ నుండి కొన్నేళ్ళుగా సినిమా రావడం లేదు. ఇంటిలిజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ తీశారు కానీ అది పూర్తయిందో , అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. మధ్యలో హీరోగా మారి ఏదో సినిమా చేద్దామనుకున్నాడు కానీ వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు వినాయక్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. రెండేళ్ళుగా చిరంజీవితో వినాయక్ సినిమా చేద్దామనుకకుంటున్నారు కానీ మెగా స్టార్ నుండి పిలుపు రావడం లేదు. మధ్యలో గాడ్ ఫాదర్ కి వినాయక్ పేరు వినిపించినా చిరు ఫైనల్ గా మోహన్ రాజా చేతిలో ఆ సినిమా పెట్టారు.

ఇక శ్రీను వైట్ల కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. మిస్టర్ , అమర్ అక్బర్ ఆంటోనీ వైట్ల కెరీర్ కి పెద్ద స్పీడ్ బ్రేక్ లేశాయి. ఈ డిజాస్టర్స్ తర్వాత శ్రీను వైట్ల ఎవరిని అప్రోచ్ అయిన పనవ్వడం లేదు. అంతకు ముందు స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినా ఆగదు, బ్రూస్ లీ అపజయాలు అందుకున్నాయి. డీ తీసిన విష్ణు మంచు తో డీ అండ్ డీ అనే సీక్వెల్ ప్లాన్ చేసినప్పటికీ అది స్క్రిప్టింగ్ స్టేజీలోనే అటకెక్కింది. ఇప్పుడు మరో హీరోతో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడు కానీ ఇంత వరకూ దాని డీటైల్స్ బయటికి రాలేదు. సో ఒకప్పుడు ఎంటర్టైన్ మెంట్ ని నమ్ముకొని బ్లాక్ బస్టర్స్ హిట్స్ డెలివరీ చేసిన శ్రీను వైట్ల కి ఇప్పుడు సినిమా అవకాశం రావడమే గగనం అయిపోతుంది.

మరో సీనియర్ డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా తీసిన సినిమా రిలీజ్ చేయలేక నాణా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రకాష్ రాజ్ ప్రదాన పాత్రలో మరాఠీలో మంచి సినిమా అనిపించుకున్న నానా పటేకర్ నట సామ్రాట్ ను తెలుగులో రంగమార్తాండ టైటిల్ తో తీశాడు కృష్ణవంశీ. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ బిజినెస్ అవ్వకపోవడంతో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. స్వయంగా కృష్ణ వంశీ రంగంలో దిగి ఎడాపెడా ఇంటర్వ్యూలు ఇచ్చినా ఈ సినిమా పై బజ్ రావడం లేదు. బిజినెస్ అవ్వడం లేదు. ఇంత వరకూ ఓటీటీ డీల్ కూడా సెట్ అవ్వలేదు.

భారీ సెట్స్ తో ప్రేక్షకులను నేత్రానందం కలిగించే అగ్ర దర్శకుడు గుణ శేఖర్ కూడా ఒక సినిమా సెట్ చేసుకునేందుకు , సెట్ చేసిన ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతుండటం చూస్తూనే ఉన్నాం. రాణా తో హిరణ్య కశిప అనే పీరియాడిక్ హిస్టారికల్ సినిమా అనుకోని ఆ కథ కోసమే కొన్నేళ్ళు కష్టపడిన గుణ శేఖర్ ఫైనల్ గా ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి కలిగింది. తన విజన్ కి ఓకే చెప్పే నిర్మాతలు లేకపోవడంతో తనే స్వంత నిర్మాణం చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. రుద్రమదేవి తో బాగా నష్టపోయిన గుణ శేఖర్ ఇప్పుడు సమంత శాకుంతలం విషయంలోనూ అవే ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. అంతో ఇంతో దిల్ రాజు సపోర్ట్ చేయబట్టి కాస్త గట్టేకాడు. ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా కష్టాలు చూస్తున్నాడు.

రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పనక్కర్లేదు. డబ్బుల కోసం ఏదో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటున్నాడు కానీ వర్మ సక్సెస్ టేస్ట్ చూసి చాలా ఏళ్లవుతుంది. బూతు సినిమాలు , బయోగ్రఫీ లు తీస్తున్నా వర్మ సక్సెస్ కోసం నానా పాట్లు పడుతూనే ఉన్నాడు. కాకపోతే సంవత్సరమంతా ఏ మాత్రం తీరిక లేకుండా ఏవో చిన్న సినిమాలతో అయితే కాలం గడిపేస్తున్నాడు.

రాజమౌళి , సుకుమార్ , శేఖర్ కమ్ముల లాంటి సీనియర్ దర్శకులు ఇంకా సక్సెస్ లో ఉంటూ మంచి కెరీర్ కొనసాగిస్తుంటే కొందరు మాత్రం కెరీర్ ఆరంభంలో పడిన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఏదేమైనా కథల పరంగా అప్ దేట్ అవ్వడం , నెక్స్ట్ లెవెల్ లో ఆలోచించడం , మేకింగ్ తో మేజిక్ చేయడం వల్లే సీనియర్ దర్శకులు కొందరు ఇంకా సక్సెస్ ఫుల్ కెరీర్ చూస్తున్నారు. మరి వెనక్కి వెళ్తున్న ఈ సీనియర్ దర్శకులు వాళ్ళను చూసి అయినా కాస్త ముండగుడు వేసి కొత్త కథలతో , మళ్ళీ ఒకప్పటి మేజిక్ తో మెప్పించగలిగితే సక్సెస్ అందుకోవచ్చు. ఏదేమైనా బళ్ళు ఓడలు , ఓడలు బళ్ళు అవుతాయన్న సామెత కొందరు సీనియర్ దర్శకులకి సరిగ్గా సరిపోతుంది.

This post was last modified on March 1, 2023 10:19 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…

7 hours ago

నీ ముగ్గురు భార్యలకూ టికెట్లు ఇప్పిస్తా .. ఓకేనా ?!

‘పవన్ కళ్యాణ్ గారు .. ఒక విషయం .. మీరు అనుమతి ఇస్తే మీరు ఇప్పటికే వదిలిపెట్టిన ఇద్దరు భార్యలు,…

10 hours ago

ఈ రెండే హాట్ టాపిక్‌

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఏపీలో రెండు సంచ‌ల‌న విష‌యాల‌పై నెటిజ‌న్లు తీవ్ర ఆసక్తి చూపించారు. వీటిలో సీఎం జ‌గ‌న్ విదేశీ…

10 hours ago

మాఫియాల‌కు .. కౌంట్ డౌన్ మొద‌లైంది: మోడీ వార్నింగ్‌

ఏపీలో మాఫియాలు చెల‌రేగిపోతున్నాయ‌ని.. ఇసుక మాఫియా కార‌ణంగా అన్న‌మ‌య్య డ్యాం కొట్టుకుపోయింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో…

11 hours ago

త‌మ్ముడ‌ని కూడా చూడ‌వా అక్కా: అవినాష్ రెడ్డి

"నా అక్క‌లు నాపై యుద్ధం చేస్తున్నారు. నాకు ఏమీతెలీదు అని ఎన్ని సార్లు చెప్పినా.. త‌మ్ముడ‌ని కూడా చూడ‌కుండా మాట‌లు…

12 hours ago

ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు రిలీఫ్‌

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు బిగ్ రిలీఫ్ ద‌క్కింది. ఆయ‌న‌పై ఉన్న స‌స్పెన్ష‌న్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (సీఏటీ)…

13 hours ago